OG Movie: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ ‘ లాంటి సినిమాలకు కమిటయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఆ సినిమాలను ఫినిష్ చేసే పనులు ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఆయన పెట్టిన జనసేన పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఎలక్షన్స్ లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు.
ఇక ఈ ఎలక్షన్స్ ముగిస్తే గాని ఆయన సినిమా షూటింగ్లకు హాజరయ్యే అవకాశాలు అయితే లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలను తొందరగా ఫినిష్ చేసి ఆ తర్వాత మరికొన్ని సినిమాలకు కమిట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ‘సలార్’ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న “శ్రేయ రెడ్డి” ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సిస్టర్ గా నటించబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఇప్పటికే శ్రేయ రెడ్డి ఓజీ సినిమాలో తను నటిస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
ఇక దానికి తగ్గట్టుగానే ఆమె పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్టుగా తను ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆమె పవన్ కళ్యాణ్ సిస్టర్ క్యారెక్టర్ లో నటించి మెప్పించబోతుందట.
ఇక సలార్ లో ఉన్నట్టే ఈ సినిమాలో కూడా ఈమె పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుందట.
అందుకే ఆ పాత్ర కోసం ఆమెను తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక డైరెక్టర్ సుజీత్ ఈ క్యారెక్టర్ ను చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు అంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక మొత్తానికైతే ఈమె ఈ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన రిలీజ్ కి రెఢీ అవుతుంది…