Salaar 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ స్టార్ స్టేటస్ అయితే లభిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ లాంటి స్టార్ హీరో బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంటు ముందుకు దూసుకెళ్తుంది. మరి ఏది ఏమైనా తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ తన సత్తా చాటుకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. ఇప్పటికే సలార్ (Salaar), కల్కి(Kalki) లాంటి రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇప్పుడు సలార్ 2 (Salaar 2) సినిమాని కూడా పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సలార్ 2 సినిమాలో పృధ్విరాజ్ సుకుమారన్ ప్రభాస్ ని వెన్నుపోటు పొడవబోతున్నాడనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి ‘శౌర్యంగా పర్వం’ పేరుతో సలార్ 2 సినిమా పట్టలేక్కబోతుంది. ఇక శౌర్యంగా పర్వం పేరుతో రాబోతున్న ఈ సినిమాను ప్రభాస్ మెప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు పృధ్వీ రాజ్ సుకుమారన్ ప్రభాస్ కి మధ్య ఒక పెద్ద యుద్ధమైతే జరగబోతుందట. ఇక అందులో భాగంగానే తన స్నేహితుడిగా ప్రభాస్ ని నమ్మించి ఆ తర్వాత వెన్ను పోటు పోడిచే భారీ సీన్ సినిమాలో ఉండబోతుందట…
మరి ఈ సీన్ ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు వీళ్లిద్దరిలో ప్రభాస్ ని హైలైట్ చేయడానికి అలాంటి సీన్లు రాసుకున్నాడు అంటూ కొంతమంది కొన్ని అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అల్టిమేట్ గా సినిమాలో ప్రభాస్ హీరో కాబట్టి ఆయనే హైలెట్ అవుతూ ఉంటాడు.
మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి తన ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా 700 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పుడు సలార్ 2 సినిమా విషయానికొస్తే ఇది అంతకుమించి వసూళ్లను రాబడుతుందంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మరొకసారి స్టార్ హీరోగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…