https://oktelugu.com/

Sakunthalam : రెండు రోజులకే ‘శాకుంతలం’ బిజినెస్ క్లోజ్..ఈ ఏడాది అతి పెద్ద డిజాస్టర్

Sakunthalam : విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సౌత్ లో వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సమంత గత ఏడాది ‘యశోద’ సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఇక రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘శాకుంతలం’ అనే చిత్రం విడుదలై మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు ఇంత నాసిరకపు స్క్రీన్ ప్లే మరియు […]

Written By:
  • Vicky
  • , Updated On : April 16, 2023 / 08:22 AM IST
    Follow us on

    Sakunthalam : విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సౌత్ లో వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న సమంత గత ఏడాది ‘యశోద’ సినిమాతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఇక రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘శాకుంతలం’ అనే చిత్రం విడుదలై మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకుంది.

    ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు ఇంత నాసిరకపు స్క్రీన్ ప్లే మరియు ఇంత క్వాలిటీ లేని గ్రాఫిక్స్ ని ఇదివరకు మేము ఎప్పుడూ చూడలేదు అంటూ పెదవి విరిచారు.ఇదంతా పక్కన పెడితే డిజాస్టర్ టాక్ ప్రభావం ఈ సినిమా పై చాలా బలంగానే పడిందని తెలుస్తుంది.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కేవలం కోటి రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది అట.

    మొదటి రోజు తో పోలిస్తే రెండవ రోజు వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో 70 శాతానికి పైగా తగ్గిపోయిందని,కొన్ని చోట్ల గ్రాస్ వసూళ్లు నెల రోజుల క్రితం విడుదలైన సినిమాలతో సమానంగా ఉందని, ఇలాంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాని ఈ ఏడాది లో చూడడం ఇదే మొదటిసారి అంటున్నారు.చాలా ప్రాంతాలలో ఈ సినిమా రెండవ రోజు బిజినెస్ క్లోజ్ అయిపోయిందట.కనీసం వీకెండ్ వరకు అయినా పర్వాలేదు అనే రేంజ్ లో వసూళ్లను రాబడుతుంది అనుకుంటే, బీలో యావరేజి రేంజ్ లో కూడా కలెక్షన్స్ రాకపొయ్యేసరికి ఈ సినిమాని కొన్న బయ్యర్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

    ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు కేవలం 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చిందట, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 20 కోట్లు వసూలు చెయ్యాలి.అది దాదాపుగా అసాధ్యమని అంటున్నారు.సోమవారం నుండి కలెక్షన్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి, తొందరగా ఓటీటీ లోకి విడుదల చేస్తే కనీసం లాస్ అయినా రికవరీ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.మరి మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.