Sakhi Movie Trailer: ‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా నటించిన సినిమా ‘గుడ్ లక్ సఖి’. ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. నగేష్ కుకునూరు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ‘మన దేశం గర్వపడేలా షూటర్స్ ను రెడీ చేయబోతున్నాను’ అంటూ జగపతిబాబు డైలాగ్ తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ అదిరిపోయింది. బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ‘కీర్తి సురేష్’ జర్నీని చాలా బాగా చూపించారు. ట్రైలర్ లో ఎమోషన్ కూడా బాగా హైలైట్ అయింది.

అయితే, ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అయి ఏడాది గడిచింది. ‘కీర్తి సురేష్’ సోలో సినిమాలన్నీ ప్లాప్ లు అవ్వడం, కరోనా సెకెండ్ వేవ్ లాక్ డౌన్ తో ‘గుడ్ లక్ సఖి’ సినిమా కొనడానికి ఏ బయ్యరు ముందుకు రాలేదు. పైగా డిజిటల్ అండ్ టీవీ శాటిలైట్ రైట్స్ కూడా ఇంతవరకు అమ్ముడుపోలేదు. సినిమా రిలీజ్ అయి హిట్ అయితేనే, ఈ సినిమా రైట్స్ కి డబ్బులు వస్తాయి. లేదు అంటే.. ఈ సినిమా వల్ల నిర్మాతలకు భారీ నష్టాలూ వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. కచ్చితంగా పాటించాల్సిన వాస్తు చిట్కాలు ఇవే!

అయితే, ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. జనవరి 28న ‘గుడ్ లక్ సఖి’ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు పోటీగా మరే చిత్రం లేకపోవడంతో మరింతగా ప్రమోట్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తే.. ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ, గతేడాది, కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు డిజిటల్ వేదికల పైనే బిగ్ ప్లాప్ అయ్యాయి.
దాంతో ‘గుడ్ లక్ సఖి’కి గుడ్ లక్ ఉండదు అనే టాక్ ఎక్కువ అయింది. కాకపోతే ట్రైలర్ బాగుంది కాబట్టి.. ఈ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
Also Read: ‘ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా’.. అదిరాయి ఫుల్ లిరిక్స్ !
[…] Rajinikanth Shivaji Movie: ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్- తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘శివాజీ’ సినీ ప్రేక్షకులందరి ఫేవరెట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా వసూళ్ల పర్వం కురిపించింది. బ్లాక్మ మనీ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. ఇకపోతే ఈ చిత్రంలో రజనీకాంత్ ఎమోషనల్, మాస్ ఎలిమెంట్స్, డ్యాన్స్, ఇతర అన్ని అంశాల్లో సత్తా చాటాడు.శ్రియ రజనీకాంత్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సంగతులు అలా ఉంచితే.. చిత్రంలో ఓ ఫన్నీ సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. […]