https://oktelugu.com/

Saindhav OTT: రేపటి నుంచి ఓటీటీలో సైంధవ్… ఎక్కడ చూడొచ్చంటే?

సంక్రాంతి చిత్రాల్లో సైంధవ్ నష్టాలు మిగిల్చింది. దర్శకుడు మంచి పాయింట్ ఎంచుకున్నాడు. అయితే తెరపై ఆవిష్కరించడంలో ఫెయిల్ అయ్యాడు. పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 2, 2024 / 12:29 PM IST
    Follow us on

    Saindhav OTT:  విక్టరీ వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కింది సైంధవ్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించాడు. ‘హిట్’ సిరీస్తో ప్రేక్షకుల మనసులు దోచిన శైలేష్ కొలను వెంకీతో చాలా కాలం తర్వాత భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చేయించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న సైంధవ్ విడుదలైంది. ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అనూహ్యంగా సైంధవ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

    ఈ క్రమంలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. సంక్రాంతి చిత్రాల్లో సైంధవ్ నష్టాలు మిగిల్చింది. దర్శకుడు మంచి పాయింట్ ఎంచుకున్నాడు. అయితే తెరపై ఆవిష్కరించడంలో ఫెయిల్ అయ్యాడు. పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో నెల రోజుల్లోపే సైంధవ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా సినిమా విడుదలైన నాలుగు వారాలకు మాత్రమే ఓటీటీ విడుదల ఉంటుంది. సైంధవ్ థియేట్రికల్ రన్ దాదాపు ముగియడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది

    సినిమాపై ఏర్పడిన హైప్ రీత్యా భారీ ధరకు ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సైంధవ్ ఓటీటీ హక్కులు దక్కించుకుంది. కాగా ఫిబ్రవరి 3 నుండి సైంధవ్ స్ట్రీమ్ కానుంది. అంటే ఫిబ్రవరి 2 అర్థ రాత్రి నుండి సైంధవ్ ని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చన్న మాట. వెంకటేష్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    సైంధవ్ మూవీలో ఓ పాపకు తండ్రిగా వెంకీ నటించారు. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కూతురికి అరుదైన వ్యాధి సోకుతుంది. కాపాడుకోవాలంటే కోట్ల రూపాయల విలువైన మెడిసిన్ కావాలి. కూతురిని కాపాడుకునేందుకు వెంకీ ఏం చేశాడు? ఈ క్రమంలో మాఫియాతో ఎందుకు తలపడ్డాడు? అనేది కథ. శ్రద్దా శ్రీనాధ్, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య వంటి స్టార్ క్యాస్ట్ నటించారు.