Sailesh Kolanu : చాలామంది యంగ్ డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే హిట్ ఫ్రాంచైజ్ ను చాలా సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళుతున్న దర్శకుడు శైలేష్ కొలన్ రీసెంట్ గా నానితో చేసిన హిట్ 3 (Hit 3) సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో ఆయన కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా కంటే ముందు ఆయన వెంకటేష్ (Venkatesh) తో సైంధవ్ (Saindhav) అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన కెరీర్ అనేది ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయిపోయింది. ఇక ఆ తర్వాత నాని పిలిచి మరి హిట్ 3 (Hit 3) సినిమా అవకాశం ఇవ్వడం దాంతో వీళ్లిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడడమే కాకుండా ఈ సినిమాని సక్సెస్ చేసి చూపించాలనే కసితో ఆయన కష్టపడినట్టుగా తెలుస్తోంది.
Also Read : ‘హిట్ 3’ ప్రపంచం లోకి ‘ఖైదీ’..ఇదేమి ప్లానింగ్ సామీ!
ఇక శైలేష్ కొలన్ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఆయన సినిమాలను కనక మనం చూసినట్లయితే మొదటినుంచి కూడా ఆయన సినిమాల్లో విల్లన్స్ కి ప్రాధాన్యత అయితే ఉండదు. సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు విలన్ కోసం హీరో వెతుకుతూనే ఉంటాడు. కానీ ఆ విలన్ ని రివిల్ చేసినప్పుడు మాత్రం వీడు విలనేంటి అనే ఒక భావమైతే సినిమాను చూస్తున్న ప్రేక్షకుడిలో కలుగుతోంది.
ఇక హిట్ 3 సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఎవరో అనామకుడిని తీసుకొచ్చి విలన్ అని పెట్టడం. ఆయన ఎవరో కూడా ప్రేక్షకుడికి తెలియకపోవడం వల్ల విలన్ ని రివిల్ చేసే పాయింట్ అనేది అంత ఎస్టాబ్లిష్ అయితే అవ్వలేదు దాంతో పాటుగా ఎంగేజింగ్ గా అనిపించలేదు. అందువల్లే ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చలేదు.
Also Read : ఒకడు కాదు ఇద్దరు..’హిట్ 3′ నుండి కీలక ట్విస్ట్ లీక్!
ఇక సైంధవ్ సినిమాలో సైతం విలన్ గా బాలీవుడ్ నటుడు అయిన నవాజుద్దీన్ సిద్ధికి (Nawazaddin Siddiki) ని పెట్టాడు. తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు ఆయన్ని పెద్దగా చూసింది అయితే లేదు. కాబట్టి అతను విలన్ అనగానే ప్రేక్షకుడు పెద్దగా కనెక్ట్ కాలేకపోయాడు. ఆ క్యారెక్టర్ లో కూడా పెద్దగా విలనిజం అయితే లేదు. అందువల్లే అతని సినిమాల్లో విలన్ పాత్రలు ప్రేక్షకుడిని పెద్దగా ఆకట్టుకోవు. ఇక ఆయన కూడా ఎస్టాబ్లిష్ నటులను విలన్స్ గా తీసుకొని వల్ల రివిలింగ్ అనేది పేపర్ గా చూపిస్తే ఆయన సినిమాలు ఇంకా భారీ విజయాన్ని సాధిస్తాయి…