Saiee Manjrekar: గుంటూరు మిర్చి కంటే ఘాటైన అందాలు… యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ గ్లామరస్ లుక్ వైరల్

ప్రభుదేవా దబంగ్ 3 చిత్రానికి దర్శకత్వం వహించారు. అనంతరం ఆమె వరుసగా టాలీవుడ్ చిత్రాలు చేసింది. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా గని చిత్రంలో సాయి మంజ్రేకర్ నటించింది.

Written By: Neelambaram, Updated On : February 27, 2024 6:10 pm

Saiee Manjrekar

Follow us on

Saiee Manjrekar: యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతుంది. సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురైన సాయి మంజ్రేకర్ దబంగ్ 3తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే ఆమెకు సల్మాన్ ఖాన్ వంటి స్టార్ సరసన ఛాన్స్ దక్కింది. అయితే సూపర్ హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన దబంగ్ 3 ఆశించిన విజయం సాధించలేదు.

ప్రభుదేవా దబంగ్ 3 చిత్రానికి దర్శకత్వం వహించారు. అనంతరం ఆమె వరుసగా టాలీవుడ్ చిత్రాలు చేసింది. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా గని చిత్రంలో సాయి మంజ్రేకర్ నటించింది. గని కూడా నిరాశపరిచింది. వరుణ్ తేజ్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాడు. ఫలితం మాత్రం దక్కలేదు.

మూడో చిత్రంగా మేజర్ చేసింది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ బయోపిక్ హిట్ టాక్ తెచ్చుకుంది. 2008 ముంబై టెర్రర్ అటాక్ లో కన్నుమూసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ తెరకెక్కింది.

మేజర్ చిత్రానికి మహేష్ బాబు నిర్మాత కావడం విశేషం. తెలుగు, హిందీ భాషల్లో మేజర్ కి ఆదరణ దక్కింది. పాన్ ఇండియా చిత్రంగా మేజర్ విడుదల చేశారు. ఇక గత ఏడాది విడుదలైన స్కంద చిత్రంలో సాయి మంజ్రేకర్ ఓ హీరోయిన్ గా నటించింది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద నిరాశపరిచింది.

సింగర్ గురు రాన్ధవ హీరోగా నటించిన కుచ్ కట్టా హో జాయ్ మూవీలో సాయి మంజ్రేకర్ నటించింది. ఫిబ్రవరి 16న ఈ చిత్రం విడుదలైంది. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా పర్లేదు అనిపించుకుంది. అవకాశాలు వస్తున్నా… కెరీర్ ని మలుపు తిప్పే మూవీ ఇంకా పడలేదు.

మరోవైపు మోడల్ గా సత్తా చాటుతుంది. సామాజిక మాధ్యమాల్లో అందాల విందు చేస్తుంది. తాజాగా గుంటూరు మిర్చి కంటే ఘాటైన సోయగాలు పరిచయం చేసింది. రెడ్ ట్రెండీ వేర్లో కళ్ళు జిగేల్ అనిపించింది. అమ్మడు అందాలు కట్టి పడేస్తుంటే… సోషల్ మీడియా జనాలు కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు…