గతేడాది దసరా రోజున ప్రారంభమైన మెగాస్టార్ చిరంజీవి-152వ ప్రారంభమైంది. నాటి నుంచి అభిమానులు ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తరుచూ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇటీవల నుంచి చిరంజీవి-152వ మూవీ షూటింగ్ హైదరబాద్లో శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో చిరు డ్యూయల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సిద్ధు, ఆచార్య అనే రెండు పాత్రల్లో చిరంజీవి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఉగాది రోజున(మార్చి 25) రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగతుంది. అయితే దీనికి చిత్ర యూనిట్ మాత్రం దీనిపై స్పందించలేదు.
చిరు-కొరటాల సినిమాపై ఇప్పటికే పలురకాల కథనాలు వస్తున్నాయి. వీటన్నింటికి ఫస్టు లుక్ ద్వారా ఫుల్ స్టాప్ పెట్టాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ‘ఆచార్య’ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. చిరుకు జోడిగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తుంది. అలాగే ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ కీలక పాత్రలో నటించనున్నారు.