https://oktelugu.com/

Sai Pallavi: తన పెళ్లిపై అసలు నిజం చెప్పిన సాయిపల్లవి.. షాకింగ్ కామెంట్స్…

ముఖ్యం గా ఈమె ఆ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి అందరిని ఫిదా చేసేసింది...ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియా లో సాయి పల్లవి కి సంభందించిన ఒక పిక్ చాలా వైరల్ అవుతుంది.

Written By: , Updated On : September 23, 2023 / 11:48 AM IST
Follow us on

Sai Pallavi: తెలుగు టెలివిజన్ షో అయిన ఢీ అనే డాన్స్ షో ద్వారా మొదటి సారి టెలివిజన్ లో కనిపించిన సాయి పల్లవి ఆ తరువాత మలయాళం లో వచ్చిన ప్రేమమ్ సినిమా తో మొదటి సారి గా హీరోయిన్ గా కనిపిచింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం తో ఆమె కి మలయాళం లో మంచి గుర్తింపు వచ్చింది.ఇక తాను ఆ ఇమేజ్ ని వాడుకొని తెలుగు లో శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమా తర్వాత ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ప్రస్తుతం ఉన్న హీరోయిన్ అందరిలో తనే టాప్ లో ఉంది అనే చెప్పాలి.ఎందుకంటే ఒక సినిమా స్టోరీ తనకి నచ్చాలి, అందులో తన పాత్ర కి ప్రాధాన్యత ఉంటేనే ఆమె ఆ సినిమా చేయడానికి రెడీ అవుతుంది. అంతే తప్ప మొహమాటానికి పోయి ఆమె అసలు సినిమా చేయదు.

ముఖ్యం గా ఈమె ఆ సినిమాలో తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి అందరిని ఫిదా చేసేసింది…ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియా లో సాయి పల్లవి కి సంభందించిన ఒక పిక్ చాలా వైరల్ అవుతుంది ఆ పిక్ లో ఆమె పూల దండాలు వేసుకొని పెళ్లి చేసుకున్నట్టు గా ఉంది. ఇక దాంతో సాయి పల్లవి రహస్యం గా పెళ్లి చేసుకుంది అంటూ సోషల్ మీడియా లో చాలా స్టోరీ లు వస్తున్నాయి.

ఇక దాంతో రీసెంట్ గా ఆ పిక్స్ మీద స్పందించిన సాయి పల్లవి నేను రీసెంట్ గా శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తున్న దానికి సంభందించిన పూజ కార్యక్రమాల్లో అందరు అలా పూల మాల వేసుకొని ఫోటోలు దిగారు దాంట్లో ఇంకా చాలా మంది కూడా ఉంటారు. కానీ కొంత మంది చీప్ మెంటాలిటీ తో ఉండే వాళ్ళు వాటిని క్రాప్ చేసి వాటిని సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు.నిజానికి ఆ పిక్ లో ఉన్నది ఆ సినిమా డైరెక్టర్ అయినా రాజ్ కుమార్ పెరియస్వామి…

ఈయన తో దిగిన ఫోటో ని కొంతమంది కావాలనే ఉద్దేశ్య పూర్వకంగానే నాకు పెళ్లి అయినట్టు పెయిడ్ అకౌంట్స్ నుంచి ప్రచారం చేయిస్తున్నారు.నిజానికి నేను ఇవన్నీ రూమర్స్ ని పట్టించుకోను కానీ ఆ రూమర్స్ వల్ల నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటె మాత్రం తప్పకుండ వాటిని ఖండిస్తాను అంటూ తను చాలా ఘాటు గా రియాక్ట్ అయింది…