
సాయి పల్లవి… మలయాళ చిత్రం “ప్రేమమ్” మూవీ ద్వారా కథానాయికగా పరిచయమైన న్యాచురల్ బ్యూటీ, శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘ఫిదా’మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ మంచి కథలని ఎంచుకుని టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతుంది. ప్రస్తతం టాలీవుడ్ లో ఆమెకు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అమ్మడు ఒక ప్రయోగం చేయబోతున్నట్లుగా వినిపిస్తున్న వార్త సంచలనమవుతుంది.
కోలీవుడ్ హాస్యనటుడు కాళి వెంకట్ ప్రధాన పాత్రలో రాబోతున్న చిత్రంలో హీరోయిన్ గా సాయి పల్లవిని చిత్ర యూనిట్ సంప్రదించారట. అయితే ఈ బ్యూటీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదట. సాయి పల్లవి ఇప్పుడున్న స్థాయి ని చేరుకోవటానికి ముఖ్య కారణం ఆమె ఎన్నుకున్న కథలని చెప్పొచ్చు. స్టార్ హీరోలు సైతం వెంటబడేంత ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈమె ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సన్నిహిత వర్గాలు కంగారు పడుతున్నారట.
ఇప్పటికే పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్ ’ తెలుగు రీమేక్ లోనూ సాయి పల్లవి ఆవకాశం దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి… ఈ విషయం పై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీని సమ్మర్ లో ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇటీవలనే ప్రకటించింది. ఇంకా రానాతో ‘విరాటపర్వం’, నాని ‘శ్యామ్ సింగ్ రాయ్’ సినిమాలతో సాయి పల్లవి ఫుల్ బిజీగా ఉంది.