https://oktelugu.com/

మహేష్ బాబు ఫోటోలు చూసి ఆశ్చర్య పోతుంటా !

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే అమ్మాయిలకు పిచ్చి. ఆయన అందం, ఆయన స్కిన్ కలర్ టోన్ అంటే.. అమ్మాయిలు తెగ ఇంట్రస్ట్ చూపిస్తారు. అలాగే, రౌడీ బేబీ సాయి పల్లవి కూడా మహేష్ అందానికి తెగ ఫిదా అయిపోయాను అని చెబుతుంది. సాయి పల్లవి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి ఒక మాట చెప్పమని అడిగితే.. సాయిపల్లవి చిన్న గ్యాప్ కూడా లేకుండా గడగడా చెప్పేసుకుంటూ వెళ్ళింది. Also Read: ‘వకీల్ […]

Written By:
  • admin
  • , Updated On : December 17, 2020 / 04:43 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే అమ్మాయిలకు పిచ్చి. ఆయన అందం, ఆయన స్కిన్ కలర్ టోన్ అంటే.. అమ్మాయిలు తెగ ఇంట్రస్ట్ చూపిస్తారు. అలాగే, రౌడీ బేబీ సాయి పల్లవి కూడా మహేష్ అందానికి తెగ ఫిదా అయిపోయాను అని చెబుతుంది. సాయి పల్లవి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి ఒక మాట చెప్పమని అడిగితే.. సాయిపల్లవి చిన్న గ్యాప్ కూడా లేకుండా గడగడా చెప్పేసుకుంటూ వెళ్ళింది.

    Also Read: ‘వకీల్ సాబ్’ లీక్.. వైరల్ వీడియోలు

    ఆ మాటలను సాయి పల్లవి మాటల్లోనే వింటే.. “ఆమ్మో.. మహేష్ మామూలు హ్యాండ్సమ్ గా ఉండడు. అసలు మచ్చలేని స్కిన్. నేను ఒక్కోసారి ఆయన ఫోటోలు జూమ్ చేసి చూసి ఆశ్చర్య పోతుంటా… ఆ టోన్ కి, ఆ స్పాట్ లెస్ స్కిన్ కి” అంటూ సాయిపల్లవి సిగ్గు మొహమాటం లేకుండా మహేష్ పై తన ఇష్టాన్ని అభిమానాన్ని ఇలా చాటుకొంది అన్నమాట.

    పైగా మహేష్ గురించి మరో మాట చెబుతూ.. “ అసలు ఒక మనిషి అంత అందంగా ఉండడం అసాధ్యం అనుకుంటాం. కానీ మనకి మహేష్ బాబు ఉన్నాడు” అంటూ మొత్తానికి సాయిపల్లవి తెగ సిగ్గుపడిపోతూ చాల స్మూత్ గా మహేష్ గురించి చెప్పుకొచ్చింది. మహేష్ ఫ్యాన్స్ కి ఈ కామెంట్స్ తెగ నచ్చేశాయి.

    Also Read: హైప్ పెంచేందుకు సూపర్ స్కెచ్ వేసిన బిగ్ బాస్ !

    ఇక సాయి పల్లవి ప్రస్తుతం లవ్ స్టోరీ, అలాగే “విరాట పర్వం” సినిమాలో నటిస్తోంది. దీనికితోడు మరో తమిళ సినిమా కూడా సాయి పల్లవి చేతిలో ఉంది. అలాగే నాని సరసన “టక్ జగదీష్”లో నటించనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్