Sai Pallavi: సౌత్ ఇండియా లో విపరీతమైన టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సాయి పల్లవి పేరు నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈటీవీ లో ప్రసారం అయ్యే ఢీ డ్యాన్స్ షో ద్వారా పాపులారిటీ ని సంపాదించిన ఈమె, ఆ తర్వాత మలయాళం లో ‘ప్రేమమ్’ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలిసినిమాతోనే భారీ హిట్ ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆమె ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తూ ముందుకు దూసుకుపోయిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే అవకాశాలు వస్తున్నాయి కదా అని ఆమె మిగతా హీరోయిన్స్ లాగా ఏ సినిమా పడితే, ఆ సినిమా ఒప్పుకొని చేయడం లేదు. చాలా జాగ్రత్తగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ ముందుకెళ్తుంది.
తన మనసుకి నచ్చితే ఎంత చిన్న హీరో తో కలిసి సినిమా చేయడానికైనా రెడీ, పెద్దగా రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేయదు. కానీ మనసుకి నచ్చకపోతే మాత్రం ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా రిజెక్ట్ చేస్తుంది. గతం లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం లో చెల్లి పాత్ర కోసం సాయి పల్లవి ని కలిశారు. కానీ ఆమె నేను రీమేక్ సినిమాల్లో నటించను అని ముఖం మీదనే చెప్పి పంపేసింది. ఇప్పుడు కూడా అలాంటి సందర్భం ఆమెకి తమిళం లో వచ్చింది. నేషనల్ అవార్డు గ్రహీత చియాన్ విక్రమ్ హీరో గా, అరుణ్ కుమార్ దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కబోతుంది. అరుణ్ కుమార్ గతంలో ‘మండేలా’, ‘మావీరన్’ లాంటి సినిమాలు చేసాడు. ఇవి తమిళం లో కమర్షియల్ గా హిట్ అయ్యాయి. అలా వరుస సక్సెస్ లతో ఫామ్ లో ఉన్న దర్శకుడు, నేషనల్ అవార్డు విన్నర్ విక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ రోల్ అంటే ఎగిరి గంతేస్తారు.
కానీ సాయి పల్లవి మాత్రం నో చెప్పింది. తనకి క్యారక్టర్ పెద్దగా నచ్చలేదని, పైగా ఇప్పుడు డేట్స్ కూడా ఖాళీ లేవని చెప్పి వెనక్కి పంపేసింది. ఇది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె నాగ చైతన్య తో కలిసి ‘తండేల్’ అనే చిత్రంలో నటిస్తుంది. వచ్చే నెల 7వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం నుండి విడుదలైన ‘బుజ్జి తల్లి’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తో పాటు బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ లో సీతగా నటిస్తుంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, రావణుడిగా కేజీఎఫ్ యాష్, సూర్పనక్క గా రకుల్ ప్రీత్ సింగ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు.