spot_img
Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi Out of Kalki 2: 'కల్కి 2' నుండి సాయి పల్లవి అవుట్.....

Sai Pallavi Out of Kalki 2: ‘కల్కి 2’ నుండి సాయి పల్లవి అవుట్.. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కి ఛాన్స్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు..

Sai Pallavi Out of Kalki 2: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ‘కల్కి 2898 AD’ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఏ డైరెక్టర్ కి రానటువంటి అద్భుతమైన ఆలోచన డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి వచ్చింది. ఆలోచనలు అందరికీ వస్తాయి, దానిని వెండితెర పై అద్భుతంగా మలిచే కళ అందరిలో ఉండదు. అలాంటి అరుదైన కళ ఉన్నటువంటి అతి తక్కువ మంది ఇండియన్ డైరెక్టర్స్ లో ఒకరు నాగ్ అశ్విన్. 800 ఏళ్ళ తర్వాత కలియుగాంతం లో మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉన్నప్పుడు , శ్రీ మహావిష్ణువు పదవ అవతారం కల్కి రూపం లోకి భూమి మీదకు వస్తాడని, అతని రాకని అడ్డుకోవడం కోసం కలి ప్రయత్నాలను అడ్డుకునేందుకు కర్ణుడు పునర్జన్మ ఎత్తడం, మహాభారతం లోని కురుక్షేత్రం యుద్ధం లో శ్రీ కృష్ణుడి చేత శాపగస్త్రుడైన అశ్వద్దామా కూడా కలితో పోరాడి కల్కి జనానికి తోడ్పడడం , ఇలాంటి అంశాలతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని మొదటి భాగం చివర్లో అధికారిక ప్రకటన చేశారు. రీసెంట్ గానే ఈ సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. మొదటి షెడ్యూల్ లో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ లపై కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. వచ్చే నెలలో రెండవ షెడ్యూల్ లో ప్రభాస్, కమల్ హాసన్ , అమితాబ్ బచ్చన్ లపై ఇంటర్వెల్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. అందుకు సంబంధించిన సెట్స్ ని కూడా రీసెంట్ గానే పూర్తి చేశారు. ఈ సన్నివేశం లో హీరోయిన్ పాత్ర కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ పాత్ర అన్వేషణలోనే ఉన్నారు మేకర్స్. మొదటి భాగం లో హీరోయిన్ గా నటించిన దీపికా పదుకొనే సీక్వెల్ నుండి తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ఆమె స్థానంలోకి సాయి పల్లవి ని తీసుకున్నారంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దాదాపుగా సాయి పల్లవి ఖరారు అయిపోయింది కూడా. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, ఇప్పుడు ఆమె ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆమె స్థానంలోకి అలియా భట్ రాబోతుందని అంటున్నారు. రీసెంట్ గానే అలియా భట్ తో మేకర్స్ చర్చలు జరపగా, ఆమె ఈ చిత్రం లో నటించేందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలనే ఈ విషయం లో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ లో అలియా భట్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. దీపికా పదుకొనే క్రేజ్ కి ఈమె ఏ మాత్రం తీసిపోదు . ఈ చిత్రం లోకి ఆమె ఎంట్రీ ఇవ్వడం వల్ల, సినిమా రేంజ్ ఇంకా పెరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular