Bigg Boss 9 Telugu: ఈ వారం బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) ఎలిమినేషన్ పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తోంది బిగ్ బాస్ టీం. శనివారం ఎపిసోడ్ లో దివ్య కచ్చితంగా ఎలిమినేట్ అయిపోవచ్చు. గత వారం లోనే ఆమె ఎలిమినేట్ అయ్యింది, కానీ ఇమ్మానుయేల్ వద్ద ఉన్నటువంటి పవర్ అస్త్ర ని ఉపయోగించి ఎలిమినేషన్ ని రద్దు చేసాడు. ఈ వారం కూడా ఆమెకే తక్కువ ఓటింగ్ వచ్చింది కాబట్టి, ఒక ఎలిమినేషన్ ద్వారా దివ్య అవుట్ అనేది ఖరారు అయ్యింది. నామినేషన్స్ లో ఉన్న మిగిలిన 7 మందిలో తనూజ, పవన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్ తప్ప, మిగిలిన నలుగురు డేంజర్ జోన్ లోనే ఉన్నారని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మొదటి స్థానం లో పవన్ కళ్యాణ్ కొనసాగుతుండగా, రెండవ స్థానం లో తనూజ, మూడవ స్థానం లో ఇమ్మానుయేల్ కొనసాగుతున్నారు.
ఇమ్మానుయేల్ కి మిస్సెడ్ కాల్ ఓటింగ్ తనూజ, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ పడుతోందట. ఇక ఈ ముగ్గురి తర్వాత నాల్గవ స్థానం లో భరణి కొనసాగుతున్నాడు. ఆ తర్వాత ఐదవ స్థానం లో డిమోన్ పవన్, ఆరవ స్థానం లో సుమన్ శెట్టి, 7 వ స్థానం లో సంజన కొనసాగుతున్నారట. ఈ నలుగురి మధ్య ఓటింగ్ శాతం గ్యాప్ 0.2 రేంజ్ లో కూడా లేదట. ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కంటెస్టెంట్స్ కి సంబంధించిన అభిమానులు, తమ అభిమాన కంటెస్టెంట్ బలంగా ఓట్లు వెయ్యాలని అంటున్నారు విశ్లేషకులు. వాస్తవానికి సంజన రీతూ చౌదరి పై నామినేషన్స్ సమయం లో నోరు జారింది కాబట్టి, కచ్చితంగా ఆమె ఓటింగ్ బాగా తగ్గిపోతుందని, ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు మాత్రం ఆమెకు చాలా బలంగా ఉందట. అత్యధిక శాతం మంది ఫ్యామిలీ ఆడియన్స్ రీతూ చౌదరి పై సంజన చేసిన కామెంట్స్ ని ఏకీభవిస్తున్నారట. ఎందుకంటే హౌస్ లో ఆమె డిమోన్ పవన్ తో నిజంగానే అలా ఉంటుంది కాబట్టి, సంజన మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని అంటున్నారు. ఇక భరణి ఓటింగ్ కూడా ఈమధ్య కాలం లో భారీగా పెరిగింది. కానీ, మొదటి మూడు స్థానాలు మరియు చివరి స్థానం తప్ప, మధ్యలో ఉన్నటువంటి ఈ నలుగురు కంటెస్టెంట్స్ ఓటింగ్ ఆర్డర్ గంట గంటకు మార్పు చెందుతూ వస్తుందని, నేడు అర్థరాత్రి 12 గంటలకు ఓటింగ్ ముగిసే సమయానికి ఎవరు చివరి రెండు స్థానాల్లో ఉంటారో, వాళ్ళు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా ఉంటుందని చెప్పొచ్చు.