Sai Pallavi : సాయి పల్లవి అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఇకపై ఆమె సినిమాలు చేయరంటూ ఓ హాట్ న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సాయి పల్లవి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. హీరోయిన్స్ లో ఆమెను చాలా ప్రత్యేకంగా ప్రేక్షకులు చూస్తారు. సాయి పల్లవి పాత్రలు ఎప్పటికీ మదిలో నిలిచిపోయేవిగా ఉంటాయి. ఆమె సహజ నటన, తిరుగులేని డాన్సింగ్ గౌరవం, కీర్తి తెచ్చిపెట్టాయి. సాయి పల్లవి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ.

దీంతో ఆమె కాల్షీట్స్ కోసం ఎదురుచూసే దర్శక నిర్మాతలు ఎందరో ఉన్నారు. అయితే సాయి పల్లవి ఆచితూచి సినిమాలు చేస్తారు. తన సిద్ధాంతాలకు లోబడి ఉంటేనే సదరు పాత్ర చేస్తారు. ముఖ్యంగా ప్రాధాన్యత లేని హీరోయిన్ రోల్స్ అసలు చేయరు. స్టార్ హీరోల చిత్రాలైనా నిర్ధాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తారు. కాగా సాయి పల్లవి సడన్ గా సినిమాలు చేయడం ఆపేశారు. ఆమె కొత్త చిత్రాలకు సైన్ చేయడం లేదు. దీంతో పలు పుకార్లు తెరపైకి వస్తున్నాయి.
సాయి పల్లవి గత ఏడాది లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలలో నటించారు. అవి రెండు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ ఏడాది రానాకు జంటగా విరాటపర్వం మూవీ చేశారు. ఈ పీరియాడిక్ లవ్ అండ్ రివల్యూషనరీ డ్రామా పెద్దగా ఆడలేదు. సాయి పల్లవి నటనకు మాత్రం మార్కులు పడ్డాయి. ఇక సాయి పల్లవి చివరి రిలీజ్ గార్గి. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. గార్గి థియేటర్స్ లోకి వచ్చి నాలుగు నెలలు దాటిపోతుంది. అయినా ఆమె కొత్త సినిమా ప్రకటన చేయలేదు.
ఈ నేపథ్యంలో ఆమె ఉద్దేశపూర్వకంగానే కొత్త సినిమాలకు సైన్ చేయడం లేదని తెలుస్తుంది. సాయి పల్లవి నటనకు గుడ్ బై చెప్పేశారు అంటున్నారట. కారణం తెలియదు కానీ ఆమెకు నటనపై ఆసక్తి లేదట. ఆమె డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. సినిమాల్లోకి రాకముందు సాయి పల్లవి జార్జియా దేశంలో డాక్టర్ డిగ్రీ పూర్తి చేశారు. దీంతో ఆమె వైద్య వృత్తిలో కొనసాగాలి అనుకుంటున్నారట. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. గతంలో కూడా ఇలాంటి పుకార్లు వినిపించిన తరుణంలో కొంత కాలం తర్వాత క్లారిటీ వచ్చే సూచనలు కలవు.
