Sai Pallavi : తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది సాయి పల్లవి. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ, కేవలం ప్రతిభతో రాణిస్తున్న అరుదైన నటి. ఆ మధ్య సాయి పల్లవి గ్యాప్ తీసుకుంది. దాంతో కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. సాయి పల్లవి నటనకు గుడ్ బై చెప్పింది. వివాహం చేసుకోనుంది. డాక్టర్ గా సెటిల్ కానుంది అంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ గాసిప్స్ కి సాయి పల్లవి ఫుల్ స్టాప్ పెట్టింది. మంచి కథల కోసమే ఆలస్యం అవుతుందని స్పష్టత ఇచ్చింది.
Also Read : సాయి పల్లవి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?
గార్గి అనంతరం సాయి పల్లవికి రెండేళ్ల గ్యాప్ వచ్చింది. అయితే అమరన్ మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. గత ఏడాది విడుదలైన అమరన్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన రియల్ లైఫ్ డ్రామా తెలుగు, తమిళ భాషల్లో ఆదరణ దక్కించుకుంది. మూడు వందల కోట్లకు పైగా వసూళ్లతో శివ కార్తికేయన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అమరన్ అనంతరం సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తండేల్ తెరకెక్కింది.
ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన తండేల్ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నాగ చైతన్య, సాయి పల్లవి తమ అద్భుతమైన నటనతో మెప్పించారు. గ్లామరస్ హీరోయిన్స్ ని మాత్రమే ఆదరించే బాలీవుడ్ లో సైతం రాణిస్తుంది సాయి పల్లవి. రన్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న రామాయణ లో సీతగా నటిస్తుంది. రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగం షూటింగ్ చివరి దశలో ఉంది. మరో హిందీ చిత్రానికి కూడా సాయి పల్లవి సైన్ చేసింది. కాగా సాయి పల్లవి ఖాతాలో ఇంకొక భారీ ప్రాజెక్ట్ వచ్చి చేరినట్లు సమాచారం.
దేశంలోని అతిపెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటిగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ తో సాయి పల్లవి చేయి కలిపారట. ఆ బ్యానర్ లో ఓ మూవీ చేస్తున్నారట. ఓ సీనియర్ రచయిత రాసిన కథను సాయి పల్లవి ఓకే చేసిందట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సాయి పల్లవి మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు. కాగా సాయి పల్లవి నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ గార్గి. 2022లో గార్గి విడుదలైంది. ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Also Read : సాయిపల్లవిని రిజెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో అతడే.. ఏమైనా దమ్మున్నోడే