Sai Kiran: సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిల్లు కామన్. ప్రేమించుకొని పెళ్లి చేసుకొని విడిపోయిన జంటలు కూడా ఎందరో ఉన్నారు. అయితే అన్ని కలిసి వస్తే మరో ఆన్ స్క్రీన్ జంట ఆఫ్ స్క్రీన్ పై కూడా కనిపించేది. ఇంతకీ ఆ జంట ఎవరు అనుకుంటున్నారా? నటుడు సాయి కిరణ్, హీరోయిన్ లయ. సాయి కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొంత కాలం తర్వాత ఇండస్ట్రీకి దూరమైనటువంటి సాయికిరణ్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
గుప్పెడంత మనసు సీరియల్ లో మహేంద్ర పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తున్నారు. ఇలా పలు సీరియల్స్ ద్వారా బిజీగా ఉన్న ఈ నటుడు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయనకు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా వెల్లడించారు. దీనిలో భాగంగా ఈ నటుడు ఒకప్పుడు హీరోయిన్ లయను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల క్యాన్సల్ అయిందని తెలుస్తోంది. ఇంతకీ ఎందుకు వీరి పెళ్లి క్యాన్సల్ అయింది అనుకుంటున్నారా.
ప్రేమించు సినిమాలో లయ, సాయి కిరణ్ ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమా అప్పట్లో సంచలనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా ద్వారా ఇద్దరికి కూడా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఈ జోడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలా ఈ జోడి గురించి పలు రకరకాల వార్తలు కూడా వైరల్ అయ్యాయి. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని అంతా అనుకున్నారు. అయితే ఇదే ప్రశ్న సాయి కిరణ్ కు ఎదురైంది. ఈ ప్రశ్నకు బదులిస్తూ.. నేను లయను ప్రేమించలేదు కానీ పెళ్లైతే చేసుకోవాలి అనుకున్నాను.
సినిమాలో మా ఇద్దరి జోడి చూసి చాలా బాగుంది నిజ జీవితంలో కూడా ఒక్కటైతే బాగుంటుందని మా పేరెంట్స్ భావించారు. ఇక వాళ్లు కూడా అలా అనుకోవడంతో అందుకు మేము కూడా ఒప్పుకున్నామని కాకపోతే జాతకాలు కలవకపోవడం వల్ల పెళ్లి చేసుకోలేదు అని తెలిపారు. అయితే తాను జాతకాలు ఎక్కువగా నమ్ముతానని.. ఒకప్పుడు జాతకాలు నమ్మేవాడిని కాదని కానీ కొన్ని పరిస్థితులు వల్ల జాతకాలు నమ్మాల్సి వచ్చిందని తెలిపారు. ఇక ఈయన పరమశివుడి భక్తుడిని అంటూ తెలిపారు సాయి కిరణ్. ఇలా జాతకాలు కలవని కారణంగానే ఇద్దరి పెళ్లి క్యాన్సల్ అయింది. అయితే ఆ తర్వాత లయ డాక్టర్ ను పెళ్లి చేసుకొని విదేశాలలో స్థిరపడింది.