Sai Kiran: రెండు దశాబ్దాల క్రితం వచ్చిన నువ్వేకావాలి ఓ సెన్సేషన్. హీరోగా తరుణ్ కి అది డెబ్యూ మూవీ. అదే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మరో హీరో సాయి కిరణ్. ఆ మూవీలో సెకండ్ హీరో రోల్ చేశారు. నువ్వేకావాలి చిత్రంలో ”అనగనగా ఆకాశం ఉంది” యూత్ ని బాగా ఆకట్టుకున్న సాంగ్. ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ లో సాయి కిరణ్ నటించడంతో పాటు, స్వయంగా పాడాడు. సాయి కిరణ్ ప్రొఫెషనల్ సింగర్ కూడాను. ఇక ప్రేమించు సినిమాలో లీడ్ హీరోగా సాయి కిరణ్ కి ఛాన్స్ వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ప్రేమించు సూపర్ హిట్.

మంచి ప్రారంభం అందుకున్న సాయి కిరణ్ దాన్ని కొనసాగించలేకపోయాడు. చెత్త సినిమాలు చేసి ఫేడ్ అవుట్ అయ్యాడు. కాగా సాయి కిరణ్ లో చాలా మందికి తెలియని మరో కోణం ఒకటి ఉంది. సాయి కిరణ్ కి పాములు పట్టే అలవాటు ఉందట. భక్తిలో భాగంగా ఆ ప్రొఫెషన్ వైపు అడుగులు వేశాడట. స్వతహాగా శివభక్తుడైన సాయి కిరణ్ పాముల్ని చంపడం అసలు ఇష్టపడేవాడు కాదట. అవగాహన లేని చాలా మంది వాటిని చంపుతుంటే చూడలేక, పాముల్ని రక్షించాలని నిశ్చయించుకున్నాడట. దాని కోసం ప్రొఫెషనల్స్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడట.
ఇక చాలా కాలంగా నటనతో పాటు ఈ వృత్తిని ఆయన కొనసాగిస్తున్నారు. జనావాసాల్లో కనిపించే పాములను పట్టి వాటిని జాగ్రత్తగా శ్రీశైలం అడవుల్లో వదిలేస్తారట. చిరంజీవి, పవన్ కళ్యాణ్ నివాసాల్లో కూడా సాయి కిరణ్ పాములు పట్టేవారట. అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించేవారట. ఓసారి తనను విషసర్పం కరవగా, చనిపోతానని భయపడ్డాడట. అలాగే మరో సందర్భంలో గోనె సంచిలో ఉన్న పదికి పైగా త్రాచు పాములు తన కాళ్ళ దగ్గర పడిపోయాయట. కదలకుండా అలానే నిల్చున్న సాయి కిరణ్, వాటిలో ఒక్కటి కరిచినా పాములను రక్షించడం మానేస్తానని మనసులో శివుడితో చెప్పాడట. అవి ఏమీ చేయకుండా అడవిలోకి వెళ్లిపోయాయట.

తనకు ఈ ప్రొఫెషన్ ఇష్టమైనప్పటికీ అమ్మ చాలా భయపడుతోందని సాయి కిరణ్ అంటున్నారు. తాను పాములు పట్టడానికి వెళ్లానని తెలిసినరోజు ఆమె నిద్రపోరని చెబుతున్నారు. ఇక సాయి కిరణ్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే.. ఆయన తండ్రి రామకృష్ణ సింగర్. లెజెండరీ సింగర్ సుశీల చిన్న నాయనమ్మ అవుతారు. సినిమాల్లో ఆఫర్స్ తగ్గాక సీరియల్ నటుడిగా బిజీ అయ్యాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల సీరియల్స్ లో కూడా నటించారు.
Also Read:Esha Gupta: అరాచకం… నగ్నంగా ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసిన రామ్ చరణ్ హీరోయిన్