https://oktelugu.com/

తేజ్ ఎందుకు టెంప్ట్ అయ్యాడో ఇప్పుడు తెలిసింది

మెగా హీరో సాయి తేజ్ చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమాను కంప్లీట్ చేసిన ఆయన కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను దేవ కట్ట డైరెక్ట్ చేయనున్నారు. తేజ్ ఇప్పటివరకు అన్నీ లవ్ సబ్జెక్ట్స్, మాస్ ఎంటెర్టైనర్లు మాత్రమే చేస్తూ వచ్చారు. కానీ దేవ కట్టతో చేయబోయే సినిమా మాత్రం పూర్తిగా భిన్నమైంది. ఇది పోలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఉండనుంది. Also Read: మహేష్ దూకుడుకి ఎన్టీఆర్ చెక్..! […]

Written By:
  • admin
  • , Updated On : October 28, 2020 / 05:04 PM IST
    Follow us on


    మెగా హీరో సాయి తేజ్ చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమాను కంప్లీట్ చేసిన ఆయన కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను దేవ కట్ట డైరెక్ట్ చేయనున్నారు. తేజ్ ఇప్పటివరకు అన్నీ లవ్ సబ్జెక్ట్స్, మాస్ ఎంటెర్టైనర్లు మాత్రమే చేస్తూ వచ్చారు. కానీ దేవ కట్టతో చేయబోయే సినిమా మాత్రం పూర్తిగా భిన్నమైంది. ఇది పోలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఉండనుంది.

    Also Read: మహేష్ దూకుడుకి ఎన్టీఆర్ చెక్..!

    దేవ కట్ట గత సినిమాల్లో ‘ప్రస్థానం’ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది కూడ డార్క్ పొలిటికల్ థ్రిల్లర్. రాజకీయాలను, వ్యక్తుల భావోద్వాగాలను కలబోసి రాసిన కథ అది. అందుకే థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపకపోయినా ఆ తరవాత మంచి పేరు తెచ్చుకుంది. బుల్లి తెర మీద ఇతర మాధ్యమాల్లో చూసేసరికి ఆ సినిమాలోని డెప్త్ ప్రేక్షకులను అర్థమైంది. హీరోలు కూడ అలాంటి సబ్జెక్ట్ ఒకటి చేయాలని దేవ కట్టను అప్రోచ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

    Also Read: షాకింగ్.. రేటు పెంచి డిస్కౌంట్ ఇచ్చిన రష్మిక..!

    కానీ ఎవరితోనూ అలాంటి సినిమా చేయని దేవ కట్ట ఇప్పుడు తేజ్ సినిమా కోసం అలాంటి కథే రాశారట. ఈ సినిమాలో రాజకీయాలు, సొసైటీ అనే అంశాలు ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ ఖరారు చేశారట. ఈ చిత్రం మీద తేజ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. కథ ఖచ్చితంగా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని ఆయన భావిస్తున్నారట. మరి ఈసారి దేవ కట్ట పెన్ పవర్ ‘ప్రస్థానం’ స్థాయిలో ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.