https://oktelugu.com/

క్రేజీ డైరెక్టర్ తో మెగా మేనల్లుడు.. దాని కోసమే !

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ అనే సినిమా నుండి మొత్తానికి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ ఫామ్ ను అలాగే కంటిన్యూ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చిత్రాల స్పెషలిస్ట్ మారుతితో కలిసి చేసిన ‘ప్రతిరోజూ పండగే’ కూడా సూపర్ హిట్ అవ్వడంతో సాయి తేజ్ మార్కెట్ అమాంతం పెరిగింది. ఆ మార్కెట్ వల్లే ‘సోలో లైఫ్ సో బెటర్’ సినిమాలో విషయం లేకపోయినా, ఆ సినిమాకి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఇక రిపబ్లిక్ సినిమాతో […]

Written By:
  • admin
  • , Updated On : April 12, 2021 / 06:20 PM IST
    Follow us on


    మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ అనే సినిమా నుండి మొత్తానికి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. ఆ ఫామ్ ను అలాగే కంటిన్యూ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చిత్రాల స్పెషలిస్ట్ మారుతితో కలిసి చేసిన ‘ప్రతిరోజూ పండగే’ కూడా సూపర్ హిట్ అవ్వడంతో సాయి తేజ్ మార్కెట్ అమాంతం పెరిగింది. ఆ మార్కెట్ వల్లే ‘సోలో లైఫ్ సో బెటర్’ సినిమాలో విషయం లేకపోయినా, ఆ సినిమాకి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.

    ఇక రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు తేజ్. దేవా కట్టా దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. కాగా సాయి తేజ్ తన సినిమాల ఊపును పెంచడానికి కసరత్తులు చేస్తున్నాడు. వరుసగా కథలు వింటున్నాడు. ఇప్పుడు పలు చిత్రాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. అందులో డైరెక్టర్ శ్రీవాస్ తో కూడా ఓ సినిమా డిస్కషన్ స్టేజ్ లో ఉందని తెలుస్తోంది.

    అలాగే సాయి తేజ్ తెలుగే కాకుండా తమిళ్ డైరెక్టర్స్ స్క్రిప్ట్స్ కూడా వింటున్నాడని.. తమిళ మార్కెట్ పై కూడా పట్టు పెంచుకోవడానికి సాయి తేజ్ ప్లాన్ లో ఉన్నాడని సమాచారం. తమిళ్ క్రేజీ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ సినిమాని కమిట్ అయ్యాడని.. వీరి మధ్య కథ పై చర్చలు జరుగాయని తెలుస్తోంది.

    ఇంతకీ ఈ వెంకట్ ప్రభు ఎవరు అంటే మన తెలుగు వాళ్లకు పెద్దగా తెలియదు గానీ, ఇతను ‘సరోజ’, ‘గ్యాంబ్లర్’, ‘బిర్యానీ’, ‘రాక్షసుడు’ లాంటి మంచి సినిమాలు చేశాడు వెంకట్ ప్రభు. మరి సాయి ధరమ్ తేజ్ – వెంకట్ ప్రభు కాంబినేషన్ సెట్ అయితే ఈ సినిమా పై ఫుల్ క్రేజ్ క్రియేట్ అవ్వడం ఖాయం.