https://oktelugu.com/

నిహారిక గురించి సాయిధరమ్ ఆసక్తికర వ్యాఖ్యలు !

నిహారిక కొణిదెల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డను నిహారిక మనువాడింది. పెళ్లి కూతురిని చేయడం.. సంగీత్.. మెహెంది.. మంగళ స్నానం.. హల్ది వేడులతో పెళ్లి ఆద్యంతం సందడిగా సాగింది. మెగా , అల్లు కుటుంబాలకి సంబందించిన వారందరూ ఈ పెళ్ళిలో పాల్గొని పండుగలా చేసుకున్నారు. పెళ్లి తర్వాత చెయ్యాల్సిన కార్యక్రమాలన్నిటిని ఒక్కొక్కటిగా నాగబాబు దంపతులు చేసేస్తున్నారు. ఇక నిహారిక అన్న వరుణ్ తేజ్ చెల్లికి ఏ విషయంలోనూ తక్కువ కాకుండా అన్నిటిని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 16, 2020 / 07:20 PM IST
    Follow us on


    నిహారిక కొణిదెల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డను నిహారిక మనువాడింది. పెళ్లి కూతురిని చేయడం.. సంగీత్.. మెహెంది.. మంగళ స్నానం.. హల్ది వేడులతో పెళ్లి ఆద్యంతం సందడిగా సాగింది. మెగా , అల్లు కుటుంబాలకి సంబందించిన వారందరూ ఈ పెళ్ళిలో పాల్గొని పండుగలా చేసుకున్నారు. పెళ్లి తర్వాత చెయ్యాల్సిన కార్యక్రమాలన్నిటిని ఒక్కొక్కటిగా నాగబాబు దంపతులు చేసేస్తున్నారు. ఇక నిహారిక అన్న వరుణ్ తేజ్ చెల్లికి ఏ విషయంలోనూ తక్కువ కాకుండా అన్నిటిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అలాగే నిహారిక బావ ‘సాయి ధరమ్ తేజ్’ తన ఇస్టాగ్రామ్ లో నిహారిక మీద చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, అలానే ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో నిహారిక, తనకు మధ్య వున్న బంధం గురించి చెప్పుకొచ్చాడు. వివరాలలోకి వెళితే…

    Also Read: ‘లూసీఫ‌ర్’ రీమేక్ కి మోహ‌న్ రాజా దర్శకుడు: మెగాస్టార్ చిరంజీవి

    ‘నిహారిక’ గురించి మాట్లాడుతూ… మా ఇంట్లో కజిన్స్‌ అంతా అన్నా చెల్లెళ్లులాగే పెరిగాం. చిన్నప్పట్నుంచీ నిహారికను చెల్లెలిగానే ఫీల్‌ అవుతుంటాను. శ్రీజ, సుస్మితతోనూ మా అందరిదీ అక్కాతమ్ముళ్ల బంధమే. నిహారికకి చాలా వరకు మా అమ్మ పోలికలు ఉంటాయంటారు. అంతా మేనత్త పోలికే అని మాట్లాడుతుంటారు. అందుకే నిహారిక మా అమ్మలాగే చూసుకుంటాను. నిహారిక ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. ఎవరింటికి వెళ్లినా సందడి చేస్తుంటుంది. నిహారిక పెళ్లి విషయంలో క్రెడిట్ మొత్తం వరుణ్‌ తేజ్‌కే ఇవ్వాలి. పెళ్లి పనులు మొత్తం అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు.పండగలు, వేడుకల్లో కుటుంబ సభ్యులందరం కలుస్తుంటాం. అయినప్పటికీ ఎప్పుడూ ఎవరో ఒకరు మిస్ అవుతుంటారు.

    Also Read: ఫైనల్ కి ముందు రచ్చ… కేసుపెట్టిన మోనాల్

    వంద శాతం కలిసేది ఇలాంటి సందర్భాల్లోనే. అందుకే నిహారిక పెళ్లి మొత్తం మా కుటుంబానికే పండగ తెచ్చిందన్నారు. ఇంస్టాగ్రామ్ పోస్ట్ గురించి మాట్లాడుతూ నిహారిక ‘సూర్యకాంతం’ అనే మూవీ చేసింది,అలానే తాను గయ్యాళి గంపలాగా చేస్తుంటది అప్పుడప్పుడు, అందుకని తనని చాలా మంది ముద్దుగా సూర్యకాంతం అని కూడా పిలుస్తారు. అలా తన అప్పగింతల సమయంలో నాకది గుర్తొచ్చి సరదాగా “మా ఇంటి సూర్య‌కాంతం ఇక మీ ఇంటి సూర్య‌కాంతం ” అని పోస్ట్ చేశానని చెప్పారు. ఇక నా విషయానికి వస్తే నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, ఇంకా 5 ఇయర్స్ చేసుకోను అని ఆ తరువాత మా అమ్మ సంతోషం కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ప్రస్తుతం సోలోగా లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను, పెళ్లి తర్వాత ఇలా ఉండదు కదా అని ఫన్నీగా చెప్పుకొచ్చారు .

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్