Also Read: కాళీమాత, ఎంఐఎం.. అగ్గిరాజేసిన రాజాసింగ్
తిరుపతిలో ఎంపీ దుర్గా ప్రసాద్.. నాగార్జున్ సాగర్లో ఎమ్మెల్సీ నోముల నర్సయ్య అకాల మరణం చెందడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ రెండు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తోంది.
తిరుపతితోపాటు నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికను మార్చిలో నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సన్నహాలు చేస్తుందని తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి.
తెలంగాణలో బీజేపీ అనుకూల పవనాలు వీస్తుండటంతో నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికల్లో సత్తాచాటాలని కమలదళం ఉవ్విళ్లురుతోంది. టీఆర్ఎస్ వరుస ఓటమిలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ సైతం నాగార్జున్ సాగర్లపై ప్రత్యేక దృష్టిసారించారు.
ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు నాగార్జున్ సాగర్లో వందకోట్ల అభివృద్ధి పనులకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగార్జున్ సాగర్లో ఈసారి ఎలాగై గెలిచి సత్తాచాటాలని కేసీఆర్ భావిస్తున్నారు.
Also Read: అక్కడ పోటీలో కాషాయమేనా?
వరుస ఓటమిలతో సతమతవుతున్న కాంగ్రెస్ కు నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక అనుకోని వరంగా మారింది. ఈ జిల్లాలో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉండటంతో ఈ ఎన్నికల్లో గెలిచి సత్తాచాటాలని భావిస్తోంది.
ఇక తిరుపతిలోనూ ప్రధాన పార్టీలన్నీ ఎంపీ సీటుపై కన్నేశారు. ఇప్పటికే టీడీపీ తరుఫున పనబాక లక్ష్మీ ప్రచారం మొదలైట్టారు. సీఎం జగన్ పాలనకు తిరుపతి ఎన్నిక రెఫరెండంగా నిలువడంతో ఈ ఎన్నికలను జగన్ ఛాలెంజ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ సైతం టీడీపీ..వైసీపీలకు ధీటుగా ప్రచారం చేస్తోంది. తిరుపతిలో బీజేపీ..జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని అడ్వాంటేజ్ గా బీజేపీ ప్రచారం ముమ్మరం చేస్తోంది.
ఒకేసారి ఏపీలో.. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజల మూడ్ తెలిసే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికలు రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపనుండటంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్