Sai Dharam Tej: మెగాస్టార్ చిరంజీవి మెనల్లుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే సుప్రీం హీరోగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయిధరమ్ తేజ్. నేటితో తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తవుతోంది. తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం సినమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. నేటితో ఈ సినిమా విడుదలై ఏడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
7 years ago, on this day, my passion to be an actor above everything became a reality. You have accepted me with all your heart from my first film and been with me through my ups and downs.
Thank you all for your invaluable Love & Support and making this journey beautiful 🙏 pic.twitter.com/Jz2DRfcSOl
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 14, 2021
ఇన్నేళ్ల తన ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్ చేశారు తేజ్. ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలకు సంబంధించి ప్రత్యేక క్లిప్‌ను షేర్ చేసిన తేజ్.. ఎడేళ్ల క్రితం ఇదే రోజు నా తొలి సినిమాతో మీరు నన్ను హృదయపూర్వకంగా ఓ నటుడిగా స్వీకరించారు. నా ఒడిడొడుకులలో తోడుగా ఉన్నారు. మీ ప్రేమ, మద్దతు నా ఈ ప్రయానాన్ని ఎంతో అద్భుతంగా మార్చాయి. మీ అందరికీ చాలా థ్యాంక్స్.. అంటూ ప్రేక్షకులు అభిమానులను ఉద్దేశిస్తూ పోస్ట్ చేశారు తేజ్.

కాగా, ఈ ఏడేల్లలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’, ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండగే’ వంటి హిట్ చిత్రాలలో నటించారు తేజ్. చివరగా తేజ్ రిపబ్లిక్ సినిమాలో కనిపించారు. ఇందులో తేజ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కాగా, ఇటీవలే తేజ్ బైక్ యాక్సిడెంట్లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన తేజ్.. ప్రస్తుతం బాగానే ఉన్నారు. త్వరలోనే దర్శకుడు మారుతితో కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
మరోవైపు తేజ్ తెలుగు సినీ పరిశ్రమలో ఏడేళ్లు పూర్తి చేసిన సందర్భంగా మెగా అభిమానులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో తమ హీరో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.