Samantha: సమంతతో నాగ చైతన్య విడిపోవడానికి ‘ప్రీతమ్ జుకల్కర్’ అంటూ పుకార్లు పుట్టించారు. దాంతో సమంత స్టైలిస్ట్ అయిన ప్రీతమ్ జుకాల్కర్ పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. పైగా సమంతతో ప్రీతమ్ సన్నిహితంగా దిగిన పాత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సమంత – చైతు కాపురంలో చిచ్చుపెట్టావ్ అని అతని పై దారుణమైన కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్ పై ఇటు సామ్ గానీ, అటు ‘ప్రీతమ్ జుకల్కర్’ గానీ ఇంతవరకు స్పందించలేదు.

కానీ తాజాగా సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ ఈ అంశం పై ఘాటుగా స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టింది. సమంత – ప్రీతమ్ కు మధ్య ఉన్న అనుబంధాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ వాళ్ళ మనసులను తీవ్రంగా గాయపరుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సాధనా సింగ్ ఒక పోస్ట్ పెడుతూ.. ‘నిజానికి ప్రీతమ్.. సమంతను అక్కా (జీజీ) అని పిలుస్తాడు. మీకు జీజీ అంటే అర్థం తెలుసు కదా.. ?’ అని నెటిజన్ల పై సీరియస్ అయింది.
పైగా ఆ పోస్ట్ లో మరో మెసేజ్ పెడుతూ.. ‘ఆ దేవుడు నాకు అర్ధం చేసుకునే తెలివిని ఇచ్చాడు. దీన్ని కొందరు తెలివిలేని వాళ్లకు పంచుదామని ఈ మెసేజ్ పెట్టాను’ అని సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. చైతు సామ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె వ్యక్తిత్వం గురించి, ఆమె క్యారెక్టర్ గురించి చైతుకి బాగా తెలుసు.
సమంతలోని మంచి తనమే తనకు బాగా ఇష్టమని చైతు ఓ సందర్భంలో చెప్పాడు కూడా. అలాంటి వ్యక్తి పై అసభ్యకరమైన పుకార్లను పుట్టించి వదలడం కచ్చితంగా తప్పే. ఇప్పటికైనా నెటిజన్లు ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిస్తే సామ్ కి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. నిజానికి సామ్ పై సానుభూతికి బదులు నెగిటివ్ కామెంట్స్ రావడానికి కారణం హీరో సిద్ధార్థ్.
అతను సమంతను ఉద్దేశించి.. ఇన్ డైరెక్ట్ గా ‘మోసగాళ్లు ఎప్పుడూ ఎప్పటికీ బాగుపడరు’ అంటూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్ లోని అర్థం గ్రహించిన నెటిజన్లు అప్పటి నుంచి సమంత వ్యవహారం పై నెగిటివ్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఏది ఏమైనా సమంత ట్రోలింగ్ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురి అయింది.