Sachin : అన్ని ఇండస్ట్రీస్ లో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పోకిరి , జల్సా చిత్రాలతో మొదలైన ఈ ట్రెండ్ కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీస్ కి కూడా ఎగబాకింది. మన తెలుగు లో ఈ రీ రిలీజ్ ట్రెండ్ కి కింగ్స్ గా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మహేష్ బాబు(Superstar Mahesh Babu) వంటి వారు నిలిచారు. వీళ్ళ పాత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రీ రిలీజ్ లో సెన్సేషన్ సృష్టించాయి. ఫలితంగా రికార్డ్స్ అన్ని వీళ్లిద్దరి ఖాతాలోనే ఉన్నాయి. ఇక తమిళనాడు లో ఈ ట్రెండ్ లో విజయ్(Thalapathy Vijay) కి పోటీ ని ఇచ్చే హీరోనే లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆయన ‘గిల్లీ’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసి 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాడు.
Also Read : పవన్ కళ్యాణ్ స్పీచ్ ని రీమేక్ చేసిన విజయ్..వైరల్ అవుతున్న వీడియో!
ఇప్పుడు రీసెంట్ గా ఆయన తన పాత సూపర్ హిట్ చిత్రం ‘సచిన్'(Sachin Re Release) ని రీ రిలీజ్ చేసి మరోసారికి తన సత్తా చాటాడు. రెండవ వారంలోకి అడుగుపెట్టిన అజిత్ కొత్త చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి పోటీని ఇస్తూ భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకుంది. కేవలం తమిళనాడు ప్రాంతం నుండి 10 కోట్ల గ్రాస్ వసూళ్లను 5 రోజుల్లో రాబట్టింది ఈ చిత్రం. కేవలం తమిళనాడు లో మాత్రమే కాదు కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఓవరాల్ గా మొదటి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ఆ చిత్ర నిర్మాతలు చెప్తున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం వసూళ్లపై సచిన్ కాస్త ప్రభావం చూపించిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. కొన్ని ప్రాంతాల్లో మెయిన్ థియేటర్స్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ ని తీసేసి సచిన్ చిత్రాన్ని ప్రదర్శించారట. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కి మంచి వసూళ్లు నమోదు అవుతున్నప్పటికీ ఇలా చేయడంతో అజిత్ అభిమానుల్లో అసంతృప్తి మొదలైంది. వచ్చే సంక్రాంతికి విజయ్ నటించిన కొత్త చిత్రం ‘జన నాయగన్’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదలైన రోజునే రెడ్ జయింట్స్ సంస్థ ద్వారా అజిత్ పాత చిత్రం విశ్వాసం ని గ్రాండ్ గా విడుదల చేస్తారని అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటి నుండే మొదలు పెడుతున్నారట. చూడాలి మరి ఈ రీ రిలీజ్ వార్ కోలీవుడ్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.
Also Read : హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం తమిళ రాజకీయాల్ని మారుస్తుందా?