Junior Ntr: తారక్ బిగ్ బాస్ మాదిరిగానే ఎమ్ఈకే కి షాక్ ఇవ్వనున్నారా….

Junior Ntr: టీవీ హోస్ట్‌గా నాగార్జున, చిరంజీవి లకు కూడా రాని ఆదరణ జూనియర్ ఎన్టీఆర్‌ హోస్టింగ్ కి లభించింది. తారక్ వాక్చాతుర్యం, మంచి జ్ఞాపకశక్తి కూడా అతనికి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. తారక్ ఎటువంటి విషయాన్ని అయినా  స్పష్టంగా, సుత్తి లేకుండా ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్తాడు. అన్ని భాషల్లో విజయవంతంగా అయినా ‘బిగ్ బాస్’ షో కు తెలుగులో మొదటి సారిగా హోస్ట్ అవతారం ఎత్తాడు తారక్. తెలుగులో ఎన్నో సందేహాల మధ్య […]

Written By: Raghava Rao Gara, Updated On : October 19, 2021 6:39 pm
Follow us on

Junior Ntr: టీవీ హోస్ట్‌గా నాగార్జున, చిరంజీవి లకు కూడా రాని ఆదరణ జూనియర్ ఎన్టీఆర్‌ హోస్టింగ్ కి లభించింది. తారక్ వాక్చాతుర్యం, మంచి జ్ఞాపకశక్తి కూడా అతనికి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. తారక్ ఎటువంటి విషయాన్ని అయినా  స్పష్టంగా, సుత్తి లేకుండా ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్తాడు.

అన్ని భాషల్లో విజయవంతంగా అయినా ‘బిగ్ బాస్’ షో కు తెలుగులో మొదటి సారిగా హోస్ట్ అవతారం ఎత్తాడు తారక్. తెలుగులో ఎన్నో సందేహాల మధ్య మొదలైన ‘బిగ్ బాస్’ సూపర్ హిట్ కావడం తరువాత సీజన్ లో కూడా తారక్ హోస్ట్ గా చేస్తారని అనుకున్నారు. ప్రేక్షకులు రెండో సీజన్లో నాని హోస్ట్ రావడంతో తారక్ హోస్ట్ గా తప్పుకున్నాడని ప్రేక్షకులకు అర్థం అయింది.

జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కోసం ఎన్టీఆర్ మళ్లీ హోస్ట్ అవతారం ఎత్తడం ప్రేక్షక అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. అంచనాలకు తగ్గట్లే ఈ షో లోనూ తారక్ తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు. షోను విజయవంతం చేశాడు. ఒక దశలో ప్రసారాలు అంతంత మాత్రంగా ఉన్నా చానల్స్ కు సైతం టిఆర్పి రేటింగ్ పెంచారు తారక్‌.

తాజాగా తొలి సీజన్‌ షూటింగ్ పూర్తి చేసిన తారక్. వచ్చే ఏడాది నుంచి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కనిపించడని
ప్రచారం వినిపిస్తుంది. ‘బిగ్ బాస్’ షో మాదిరిగానే ఇందులోనూ ఒక సీజన్‌ తోనే తారక్ కథ ముగుస్తుందా. కానీ ‘ఈఎంకే’ లో హోస్ట్ పాత్ర చాలా కీలకం. హోస్టింగ్ బట్టే షో ఆధారపడి ఉంటుంది. ఈ ప్రోగ్రాం వ్యాఖ్యాతగా తారక్ చేస్తారా  లేదా మరెవరైనా అనేది తెలుసుకోవాలంటే తరువాత సీజన్ వరకు వేచి చూడక తప్పదు.