Sitara Ghattamaneni: మహేష్ బాబు గారాలపట్టి ‘సితార’ ఏమి చేసినా క్యూట్ గానే ఉంటుంది. తన లేలేత పలుకులతో ముద్దు ముద్దు చేష్టలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. చిన్న వయసులోనే యూట్యూబ్ వీడియోలు చేస్తూ స్టార్ కిడ్స్ లో తనకున్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అనిపించుకుంది. ఐతే, ఎనిమిదేళ్ల సితార పాప బాలనటిగా రంగప్రవేశం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.
దిల్ రాజ్ నిర్మించే ఈ సినిమాలో ఒక చిన్నారి పాత్ర ఉంది. సినిమాలోనే ఎంతో కీలకమైన పాత్ర అది. ఇప్పుడు ఆ పాత్ర కోసం వంశీ సీతార(Sitara Ghattamaneni)ని తీసుకోబోతున్నాడని, మహేష్ బాబు కుటుంబంతో వంశీ పైడిపల్లికి మంచి అనుబంధం ఉండటంతో.. మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.

వంశీ పైడిపల్లి ఈ విషయం పై మాట్లాడుతూ ఇంతవరకు తనకు అలాంటి ఆలోచనే రాలేదు అని చెప్పుకొచ్చాడు. ఆ మధ్య మహేష్ కూడా సితార సినీ ఎంట్రీ పై కామెంట్స్ చేస్తూ ఇప్పట్లో పాప సినిమాల్లోకి రాదు అని క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇప్పటికే బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘1 నేనొక్కడినే’ సినిమాలో జూనియర్ మహేష్ బాబుగా గౌతమ్ నటించి మెప్పించాడు.
అయితే, ఆ తర్వాత మళ్ళీ గౌతమ్ మరో సినిమాలో కనిపించలేదు. మరో నాలుగేళ్ళ తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి గౌతమ్ ప్రస్తుతం నటన పై దృష్టి పెట్టాడట. ఇక మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది.
ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో మహేష్ అండ్ విలన్స్ పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.