Bhavadeeyudu Bhagat Singh: అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ వేడుక జూన్ 9న హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే దర్శకులు హరీష్ శంకర్, సుకుమార్, గోపీచంద్ మలినేని, ఉప్పెన బుచ్చిబాబు హాజరయ్యారు. ఇక కార్యక్రమం వేదికగా హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ మూవీపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ తర్వాత ప్రకటించిన చిత్రాల్లో హరీష్ శంకర్ మూవీ ఒకటి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వరుస పరాజయాల్లో ఉన్న పవన్ కి మరపురాని విజయం అందించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ చిత్రానికి నిర్ణయించారు. ఇక ఈ మూవీలో పవన్ కాలేజీ ప్రొఫెసర్ గా కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ అంతకంతకు ఆలస్యం అవుతుంది.
Also Read: BJP- Pawan Kalyan: బీజేపీ, పవన్ కళ్యాణ్.. ఓ సీక్రెట్ భేటి
దానికి కారణం హరీష్ ప్రాజెక్ట్ పక్కన పెట్టిన పవన్ మధ్యలో భీమ్లా నాయక్ మూవీ చేశాడు. కాగా మరో రీమేక్ కి సిద్ధం అవుతున్న పవన్ భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్ట్ పక్కన పెట్టినట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లకు హరీష్ అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చాడు. భవదీయుడు భగత్ సింగ్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మూవీలో డైలాగ్స్, సన్నివేశాలు చాలా కాలం చెప్పుకుంటారు. ఆ రేంజ్ లో మూవీ ఉంటుందని చెప్పి ఫ్యాన్స్ లో జోష్ నింపారు. పవన్ సైతం తన స్పీచ్ లో భవదీయుడు భగత్ సింగ్ ప్రస్తావన తెచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

దీంతో భవదీయుడు ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఉన్నా చాలా ఆలస్యం కానుందన్న పుకార్లకు తెర పడింది. అలాగే ఈ ఈవెంట్ లో పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం పై హరీష్ మండిపడ్డారు. ఇతర హీరోల ఈవెంట్స్ లో నటులను మాట్లాడనీయకుండా మీరు గోల చేస్తే.. పవన్ కళ్యాణ్ ఈవెంట్స్ కి రావడం మానేస్తారు. అప్పుడు ఆయన వీడియోలు యూట్యూబ్ లో చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈవెంట్స్ లో కొంచెం పద్ధతిగా ఉండండి అంటూ హితవు పలికారు.
Also Read:Mahesh Babu Okkadu Sister: ఒక్కడు మూవీలోని మహేష్ చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?