Ruhani Sharma Latest Photo: హీరోయిన్ రుహాని శర్మ సోషల్ మీడియాను షేక్ చేసింది. అమ్మడు గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ అండ్ నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రుహాని ధరించి టాప్ గుండెల్లో గుబులు రేపేలా ఉంది..
Also Read: కూలీ మూవీ మోనికా సాంగ్ లో డాన్స్ ఇరగదీసిన మంజుమ్మెల్ బాయ్స్ హీరో ‘సౌబిన్ షాహిర్’!
కాలం కలిసి రాలేదు కానీ రుహాని శర్మ(Ruhani Sharma) స్టార్ కావాల్సింది. అందం, అభినయం ఉండి కూడా విజయాల్లేక ఈ నార్త్ బ్యూటీ రేసులో వెనకబడింది. హిమాచల్ ప్రదేశ్ లో పుట్టిన రుహాని శర్మ మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. 2017లో వెండితెరకు పరిచయమైంది. కడైసి బెంచ్ కార్తీ ఆమె మొదటి చిత్రం. రెండో చిత్రం చిలసౌ. సుశాంత్ హీరోగా నటించిన చిలసౌ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీ జాతీయ అవార్డు అందుకుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది.
చిలసౌ లో రుహాని నటన అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా అనంతరం ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అయితే స్టార్స్ పక్కన ఆమెకు ఛాన్స్ రాలేదు. నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్ లో రుహాని శర్మ హీరోయిన్ గా చేసింది. సస్పెన్సు క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన హిట్ విజయం అందుకుంది. అయితే ఈ చిత్రంలో రుహాని పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. తక్కువ నిడివితో కూడిన ఆ పాత్ర రుహాని కెరీర్ కి ఉపయోగపడలేదు.
రుహాని శర్మకు ఆఫర్స్ వస్తున్నప్పటికీ అవన్నీ చిన్న చిత్రాలు. అవి కూడా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. బ్రేక్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది అమ్మడు. అటు బాలీవుడ్ కూడా ట్రై చేస్తుంది. ఆగ్రా చిత్రంలో రుహాని శర్మ అలాంటి సన్నివేశాల్లో నటించింది. ఆగ్రా సినిమాలోని ఇంటిమేట్ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, రుహాని శర్మ ప్రైవేట్ వీడియోలు అంటూ పుకార్లు గుప్పించారు. ఈ వార్తలపై రుహాని శర్మ అసహనం వ్యక్తం చేసింది. ఆ విషయం తనను ఎంతగానో బాధించింది అని చెప్పుకొచ్చింది.
ఆగ్రా మూవీ ప్రఖ్యాత కేన్స్ ఫెస్టివల్ లో ప్రదర్శించడం విశేషం. గత ఏడాది రుహాని శర్మ దాదాపు ఐదు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో మాస్క్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. కాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది రుహాని శర్మ. తన వెకేషన్ ఫోటోలు షేర్ చేసింది. స్లీవ్ లెస్ టాప్, స్కర్ట్ ధరించిన రుహాని గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram