Karthika Deepam: బాబును తీసుకొని షాక్ ఇచ్చిన రుద్రాణి.. మోనితను ఇంట్లో నుంచి బయటకు పంపించిన సౌందర్య!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. కార్తీక్, దీప వాళ్లతో శ్రీవల్లి బాబుకు పేరు పెట్టడం వేడుక గురించి అడగటంతో ఆ ఏర్పాట్లకు కార్తీక్ వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక కోటేష్, శ్రీవల్లి సంతోషంగా ఫీల్ అవుతారు. కోటేష్ మాటలు వింటుంటే ఆదిత్య మాటలు లాగా ఉన్నాయని కార్తీక్ తొందర్లో అనడంతో వెంటనే కోటేష్ అడుగుతాడు. కార్తీక్ ఏమీ లేదని మాటను మారుస్తాడు. మరోవైపు మోనిత కూర్చొని ఆలోచిస్తూ […]

Written By: Navya, Updated On : December 28, 2021 5:57 pm
Follow us on

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. కార్తీక్, దీప వాళ్లతో శ్రీవల్లి బాబుకు పేరు పెట్టడం వేడుక గురించి అడగటంతో ఆ ఏర్పాట్లకు కార్తీక్ వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక కోటేష్, శ్రీవల్లి సంతోషంగా ఫీల్ అవుతారు. కోటేష్ మాటలు వింటుంటే ఆదిత్య మాటలు లాగా ఉన్నాయని కార్తీక్ తొందర్లో అనడంతో వెంటనే కోటేష్ అడుగుతాడు. కార్తీక్ ఏమీ లేదని మాటను మారుస్తాడు.

Karthika Deepam

మరోవైపు మోనిత కూర్చొని ఆలోచిస్తూ ఉండగా నర్సమ్మ వచ్చి తన మాటలతో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. కార్తీక్ గురించి చాలా ఓపిక చెబుతోంది మోనిత. మళ్లీ నరసమ్మ పెళ్లయిన వ్యక్తితో ఎందుకిలా చేస్తున్నావమ్మ అని అడగటంతో వెంటనే తన పై కోపంతో అరుస్తుంది. ఇక రుద్రాణికి శ్రీ వల్లి బిడ్డకు పేరు పెడుతున్నారని తెలియటంతో అక్కడికి వెళ్లాలని అనుకుంటుంది.

Also Read: కార్తీక్ బాబును డాక్టర్ బాబుగా మార్చనున్న వంటలక్క.. పిల్లలపై ప్రేమ పెంచుకుంటున్న రుద్రాణి!

సౌందర్య దగ్గరకు రత్న సీత రావడంతో సౌందర్య ఏదైనా న్యూస్ తీసుకు వచ్చిందేమో అని అనుకుంటుంది. ఇక రత్న సీత మోనిత బాబును కారులో వదిలేసి షాపింగ్ కి వెళ్లడం.. అంతలోనే కోటేశ్ వచ్చి బాబును తీసుకోవడం ఉన్న ఈ వీడియోను చూపించేసరికి ఫోన్ సౌందర్య వాళ్లు షాక్ అవుతారు. మరోవైపు దీప, శ్రీవల్లి నామకరణ వేడుకకు ఏర్పాటు చేస్తారు. అంతలోనే శౌర్యకు చెప్పులు లేనందుకు దెబ్బ తగలడంతో కార్తీక్ చెప్పులు కొనే పరిస్థితిలో లేను అని బాధ పడతాడు.

సౌందర్య తన ఇంట్లో మోనితకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. చేసిందంతా చాలు అని ఇక నీ పొరపాటు వల్లే నీ బాబును కాపాడుకోలేక పోయావని అంటుంది. ఇక సీతారత్నం చూపించిన వీడియోను మోనితకు చూపిస్తుంది సౌందర్య. ఇక మోనితను ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి సౌందర్య నిశ్చయించుకుంది. తరువాయి భాగం లో కోటేష్ బాబుకు నామకరణం ఏర్పాట్లు జరుగుతుండగా రుద్రాణి వచ్చి బాబు ని తీసుకొని షాక్ ఇస్తుంది. అంతే కాకుండా దీప వాళ్లకు గట్టి వార్నింగ్ ఇస్తుంది.

Also Read: పగ తీర్చుకుంటున్న మోనిత.. ఏకంగా శ్రావ్య బిడ్డను!