Muslims Protest: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నాయకులు నుపుర్‌శర్మ, నవీన్‌జిందాల్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం దేశవ్యాప్తంగా ముస్లింలు శుక్రవారం నిరసన తెలిపారు. కొన్నిచోట్ల నిరసన హింసాత్మకంగానూ మారింది. తెలంగాణలోనూ ముస్లింలు నిరసన తెలిపారు. దీనిపై తెలంగాణ ముఖ్యమైన మంత్రి కె.తారకరారామరావు శనివారం ఖమ్మంలో నిర్వహించిన సభలో స్పందించారు. దేశంలో 25 కోట్ల మంది రోడ్లపైకి రావడానికి ఎవరు కారణమో ఆలోచించాలని యువతకు సూచించారు. ఆదేశంలో ఇలాంటి పరిస్తితి ఎందుకు వస్తుందో గుర్తించాలన్నారు. మత రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరారు. 150 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో 25 కోట్ల మందికి అవమానం జరిగిందని తెలగ బాదపడిపోయిన కేటీఆర్ తీరుపై బీజేపీ నాయకులు హిందూ వాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 125 కోట్ల హిందువులను ఎంఐఎం నాయకులు అవమానించినప్పుడు, హిందూ దేవతలను దూషించినప్పుడు స్పందించని కేటీఆర్ ఇప్పుడు ఒకవర్గానికి వత్తాసు పలికేలా 125 కోట్ల మంది హిందువులను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Megastar Chiranjeevi Childhood Photo: మెగా స్టార్ చిరంజీవి చిన్నప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా?
ఇది మతరాజకీయం కాదా?
ఖమ్మం సభలో కేటీఆర్ ఒకవర్గానికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందులువ గురించి, హిందూ దేవతలకు మద్దతుగా మాట్లాడితే, కార్యక్రమాలు నిర్వహిస్తే మత రాజకీయాలు అని మాట్లాడుతున్న కేటీఆర్ ఇప్పుడు ఖమ్మంలో ఒకవర్గానికి కొమ్ముకాసేలా చేసిన వ్యాఖ్యలు ఏ రాజకీయం అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమకంటే పద్ద హిందువు ఎవరని అనే కేసీఆర్ హిందూ బాలికపై ఒకవర్గానికి చెందిన వారు గ్యాంగ్‌రేప్ చేసినా స్పందించలేదని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ పార్టీకి చెందిన ఒక్క నాయకుడు కూడా బహిరంగంగా డిమాండ్ చేయలేకపోయాడని విమర్శిస్తున్నారు. బీజేపీ మాజీ నేతలు ఏ వ్యక్తిని కించపర్చలేదని, అయినా ఒకవర్గం నిరసన తెలిపితే మాత్రం కేటీఆర్ దొంతు చించుకుని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మత రాజకీయం చేస్తున్నది ఎవరో కేటీఆర్, కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
Also Read: Kavitha Is Correct: కవిత చెప్తే కరెక్టే.. జూలై నుంచి తెలంగాణలో కొత్త పింఛన్లు!