https://oktelugu.com/

రూ.2999కే థియేటర్ బుక్.. ప్రేక్షకులకు బంపర్ ఆఫర్

స్టార్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే ఆ కిక్కే వేరు.. ఒకటే ఈలలు, గోలలు, థమ్సప్ లు, కోక్ లు, పాప్ కార్న్ లు తింటూ థియేటర్లో సినిమా చూసే రోజులు మళ్లీ వస్తాయి. ఈ కరోనా పాడుగాను.. మహమ్మారి చేయబట్టి అన్నింటికంటే పెద్ద దెబ్బ సినీ ఇండస్ట్రీమీదే పడింది. ఇప్పటికీ అన్ని రికవరీ అయినా కూడా సినిమాలు, థియేటర్లు తెరుచుకోవడం లేదు. ఈ క్రమంలోనే ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్ కు రప్పించేందుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 07:07 PM IST
    Follow us on

    స్టార్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే ఆ కిక్కే వేరు.. ఒకటే ఈలలు, గోలలు, థమ్సప్ లు, కోక్ లు, పాప్ కార్న్ లు తింటూ థియేటర్లో సినిమా చూసే రోజులు మళ్లీ వస్తాయి. ఈ కరోనా పాడుగాను.. మహమ్మారి చేయబట్టి అన్నింటికంటే పెద్ద దెబ్బ సినీ ఇండస్ట్రీమీదే పడింది. ఇప్పటికీ అన్ని రికవరీ అయినా కూడా సినిమాలు, థియేటర్లు తెరుచుకోవడం లేదు. ఈ క్రమంలోనే ప్రేక్షకులను మళ్లీ థియేటర్స్ కు రప్పించేందుకు కరోనా భయాన్ని పోగొట్టేందుకు థియేటర్ యాజమాన్యాలు రెడీ అయ్యాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కరోనా భయానికి సామూహికంగా కూర్చునే థియేటర్లకు జనాలు వచ్చే పరిస్థితి లేదు. అందుకే ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు ఆకర్షించడానికి థియేటర్ యాజమాన్యాలు, నిర్మాతలు ప్లాన్లు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమా షూటింగ్ లు మొదలవుతున్నాయి. అయితే సినిమాలను థియేటర్లలో విడుదల చేసే పరిస్థితి మాత్రం లేదు. ఇప్పుడు ఓటీటీలలోనే రిలీజ్ చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఈ క్రమంలోనే ప్రేక్షకులను ఆకర్షించడానికి ఐనాక్స్ మూవీస్ గ్రూప్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.2999కే థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకొని నచ్చిన సినిమా చూడొచ్చని తెలిపింది. ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకే ఈ అవకాశం ఉంటుంది. వారు థియేటర్లోని 50శాతం సీట్లలోనే కూర్చొని ఈ సినిమాలు చూడొచ్చు.

    ఇక ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాని, షోటైంని కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు tickets@inoxmovies.comకి మెయిల్ చేయాలని ఐనాక్స్ తెలిపింది. వారు థియేటర్ ను బుక్ చేసుకొని సినిమాను ఎంజాయ్ చేయవచ్చని సూచించింది.

    Also Read: మెగా హీరోల దండయాత్ర మొదలుకానుందా?

    ఇలా ప్రేక్షకుల్లో కరోనా భయం పొగొట్టి వారిని థియేటర్స్ కు రప్పించేందుకు తక్కువ రేటుకే వారి కుటుంబ సభ్యులతో సినిమా చూస్తే థియేటర్ యాజమాన్యాలు ప్యాకేజీ రెడీ చేస్తున్నారు. ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అన్నది వేచిచూడాలి.