
దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో.. యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో సామాన్య ప్రేక్షకులకు సైతం తెలిసిందే. ఆయన సినిమాల్లోని పోరాట సన్నివేశాలు చూస్తే.. ప్రేక్షకుల గూస్ బంస్ కావడం గ్యారెంటీ. అప్పటి వరకూ ఏ సినిమాలోనూ చూడని విధంగా ఉంటాయి జక్కన్న సినిమాలోని యాక్షన్స్ సీన్స్. మొదటి సినిమా నుంచి.. బాహుబలి వరకూ ఇదే కొనసాగింది. ఇప్పుడు RRRలోనూ అదే ఒరవడి కనిపించబోతోంది.
Also Read: బన్నీ-స్నేహా.. టెన్త్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్.. తాజ్ మహల్ ఎదుట చుంబన సంబరాలు!
ప్రతి సినిమాలోనూ ఓ హై-ఓల్టేజ్ ఫైట్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్ లో కంపోజ్ చేయబడి ఉంటుంది. అలాంటిది.. ఇప్పుడు ఇద్దరు టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న పీరియాడికల్ మూవీలో ఇంకెలాంటి ఫైట్లు ఉంటాయో అని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా.. యాక్షన్ సన్నివేశాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు జక్కన్న.
Also Read: RRR మూవీ బిగ్ బ్రేకింగ్.. ఎన్టీఆర్ కళ్లు పీకేస్తాడట.. రామ్ చరణ్ కాళ్లు తీసేస్తాడట!
ఇందులో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ సన్నివేశాలను డైరెక్ట్ చేసేందుకు ప్రఖ్యాత హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. పావెల్ ఈ మధ్యనే సెట్స్ లో అడుగు పెట్టాడు. ఈ విషయాన్ని జక్కన్న టీం అధికారికంగా ప్రకటించింది. ‘‘క్లైమాక్స్ గురించి ఎలాంటి సమాచారమూ రావట్లేదని భావిస్తున్న ఫ్యాన్స్ కోసం ఒక అప్డేట్ ఇస్తున్నాం. క్లైమాక్స్ కోసం పావెల్ వచ్చారు’’ అంటూ ‘ఆర్ఆర్ఆర్ డైరీస్’ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది యూనిట్.
అయితే.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ కోసం అమెరికా నుంచి 40 మంది యోధులను రప్పించారు. ఇప్పటికే వీరు సెట్స్ లో పాల్గొంటున్నారు. ఇది స్వాతంత్ర సంగ్రామానికి సంబంధించిన సినిమా కావడంతో.. ప్రేక్షకుల్లో ఆ ఎమోషన్ క్యారీ అయ్యేలా చూస్తున్నాడు దర్శకుడు. ఆ ఫీల్ ను ఎక్కడా తగ్గకుండా పోరాటాలు రోమాంచితంగా డిజైన్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
మరి, వాటి పవర్ ఎంత? హీరోల పోరాటాలు ఆడియన్స్ ను ఏ స్థాయిలో అలరించనున్నాయి? అన్న విషయాలు తెలియాలంటే మాత్రం అక్టోబరు 13 వరకు వెయిట్ చేయాల్సిందే. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.