https://oktelugu.com/

చరణ్ పై షూట్.. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి ?

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు బడా స్టార్స్ ఒకే సినిమాలో ఒకటిగా కనిపించబోతుండటం, రాజమౌళి విజువల్ సెన్స్ పై కామన్ ఆడియన్స్ కి అపారమైన నమ్మకం పెరగడంతో ఈ సినిమా పై మొదటి నుండి నేషనల్ వైడ్ […]

Written By: , Updated On : October 5, 2020 / 04:40 PM IST
Follow us on

'RRR' Shooting

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు బడా స్టార్స్ ఒకే సినిమాలో ఒకటిగా కనిపించబోతుండటం, రాజమౌళి విజువల్ సెన్స్ పై కామన్ ఆడియన్స్ కి అపారమైన నమ్మకం పెరగడంతో ఈ సినిమా పై మొదటి నుండి నేషనల్ వైడ్ గా బాగా క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమాకి సంబంధించి వచ్చిన చరణ్ ఫస్ట్ లుక్ వీడియోకి భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ అంతే అద్భుత ప్రశంసలు దక్కాయి.

Also Read: అమెరికాలో ఏకధాటిగా ‘పాట’పాడనున్న మహేష్..!

అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళి పై కోపంగా ఉన్నారట, దీనికితోడు మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున ఎన్టీఆర్ పాత్ర మీద రాజమౌళి ఎలాంటి వీడియోను రిలీజ్ చేయకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను బాగా నిరుత్సాహ పరిచాడు. కనీసం ఇప్పుడైనా షూట్ చేసి తమ కోసం ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన పోస్టర్ అయినా రిలీజ్ చేస్తాడా అంటే.. ఈ రోజు షూట్ లో చరణ్ పై సీన్స్ ను షూట్ చేస్తున్నాడట. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను వారి మనోభావాలను రాజమౌళి పట్టించుకోవడం లేదని, తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రాజమౌళి పై నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే గత కొన్ని నెలలుగా ఈ వీడియో కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: రియల్ హీరో సోనూసుద్.. రీల్ హీరోగా మారబోతున్నాడా?

దసరాకి ఎన్టీఆర్ పై టీజర్ రిలీజ్ అవుతుందని తారక్ అభిమానులు ఆశగా ఉన్నారు. మరి ఏమవుతుందో చూడాలి. నిజానికి కరోనా కారణంగా ఎన్టీఆర్ పార్ట్ కి సంబంధించి వర్క్ మొత్తం ఆగిపోవడం వల్లే తారక్ పై వీడియోను రిలీజ్ చేయలేదు. ఎన్టీఆర్ వీడియో అంటే అది అద్భుతమైన అవుట్ ఫుట్ తోనే రిలీజ్ అవ్వాలని జక్కన్న ప్లాన్ అట. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి రాజమౌళి బలంగానే ట్రై చేస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య సెట్స్‌ పై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారట.