https://oktelugu.com/

RRR Postponed: ప్చ్.. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మళ్లీ వాయిదా !

RRR Postponed: గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే, కరోనా మూడో వేవ్ కారణంగా సినిమాని పోస్ట్ ఫోన్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అలర్ట్ చేసింది. థర్డ్ వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా […]

Written By:
  • Shiva
  • , Updated On : January 1, 2022 / 11:35 AM IST
    Follow us on

    RRR Postponed: గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ మరో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే, కరోనా మూడో వేవ్ కారణంగా సినిమాని పోస్ట్ ఫోన్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అలర్ట్ చేసింది. థర్డ్ వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.

    RRR Postponed

    కరోనా న్యూ వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే నివారణ చర్యలు చేపట్టాయి. ఢిల్లీలో పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అక్కడ థియేటర్స్, స్కూల్స్ మూసివేశారు. కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక మహారాష్ట్రలో సైతం కరోనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అక్కడ నైట్ కర్ఫ్యూ అమలవుతుంది. మొత్తానికి నార్త్ ఇండియాలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

    మహారాష్ట్రలో థియేటర్స్ నడుస్తున్నప్పటికీ 50 శాతం సీటింగ్ కి మాత్రమే అనుమతి ఉంది. దీంతో భారీ, మీడియం బడ్జెట్ చిత్రాలు విడుదల వాయిదా వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ పోస్ట్ ఫోన్ అయిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. పోస్ట్ ఫోన్ సంగతి రాజమౌళి టీమ్ కొన్ని గంటల్లో రివీల్ చేస్తోందని కూడా సినీ జనం చెబుతున్నారు.

    Also Read: కేసీఆర్ రాంగ్.. జగనే రైటా? ఆర్ఆర్ఆర్.. సినిమా టికెట్ రేట్ తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయ్?

    ఒకవేళ ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ ఫోన్ అయితే, అభిమానులు బాగా నిరాశ చెందుతారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అసలు బాగాలేదు కాబట్టి.. ఇక చేసేది కూడా ఏమి లేదు. అయితే, ప్రేక్షకులు మాత్రం వచ్చే వారం థియేటర్స్ లో ఓ విజువల్ వండర్ చూడాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఈ సమయంలో వాళ్ళను ఈ వాయిదా ఊహాగానాలు భయపెడుతున్నాయి.

    నిజానికి గతంలో కూడా మూడు సార్లు ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడింది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలయికలో రానున్న ఈ సినిమాతో ఓ కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వటానికి రాజమౌళి చాలా బాగా కసరత్తులు చేశాడు. పైగా అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో హైలైట్ ఇంటర్వెల్ కాదు, ఆ సీక్వెన్సే !

    Tags