RRR Pre Release Business: హీరోల సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్‌లు వేరు… రాజమౌళి మూవీల ప్రీ రిలీజ్ బిజినెస్‌లు వేరు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆర్ఆర్ఆర్ మేనియానే కనిపిస్తోంది. ఒక్క ఇండియా ఏంటి.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ చూస్తుంటే.. బాక్సులు బద్దలైపోవడం ఖాయం అని అంటున్నారు.

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఈ మూవీ ఏకంగా రాజమౌళి అంతకు ముందు తెరకెక్కించిన బాహుబలి-2 కంటూ రూ.80కోట్లు ఎక్కువగా బిజినెస్ చేసింది. రిలీజ్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే.. సంచలన రికార్డులను నమోదు చేస్తుంది. బుకింగ్స్ దగ్గరి నుంచి మొదలు కొని.. మూవీ బిజినెస్ వరకు అంతా ఓ రేంజ్‌లోనే సాగుతోంది.
Also Read: Aravind Swamy In Ram Charan New Movie: చరణ్ తో మళ్ళీ కొట్టించుకోబోతున్న హ్యాండ్సమ్ హీరో
పైగా ఈ మూవీలో ఇద్దరు స్టార్ హీరోలు అయిన రామ్‌చరణ్, తారక్‌లు కూడా నటిస్తుండటం ఈ మూవీకి మరింత హైప్ తీసుకు వచ్చిందనే చెప్పుకోవాలి. దాంతో గతంలో ఎన్నడూ లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి హైప్ వచ్చేసింది. పైగా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్‌లో చేస్తుండటంతో.. ఇండియా వ్యాప్తంగా ఈ మూవీకి భారీ మార్కెట్ ఏర్పడింది.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మూవీ ఒక్క నైజాంలోనే రూ.70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అటు సీడెడ్ లో సీడెడ్ రూ.37 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.22 కోట్లు, ఈస్ట్ లో రూ.14 కోట్లు, వెస్ట్ లో రూ.12 కోట్లు, గుంటూరులో రూ.15కోట్ల బిజినెస్ చేసింది. ఇక అటు కృష్ణాలో రూ.13 కోట్లు, నెల్లూరులో రూ.8కోట్లు వరకు బిజినెస్ చేసిది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.191 కోట్ల బిజినెస్ చేసింది.

అటు రెస్టాఫ్ ఇండియాలో రూ.8 కోట్లు, కర్ణాటకలో రూ.41 కోట్లు, తమిళనాడులో రూ.35 కోట్లు, కేరళలో రూ.9కోట్లు, హిందీలో రూ.92 కోట్లు, ఓవర్సీస్ లో ఏకంగా రూ.75 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.451 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే దీనికి బ్రేక్ ఈవెన్ రావాలంటే రూ.455 కోట్లు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని భాషల్లో కూడా రికార్డు వసూళ్లను సాధిస్తేనే ఈ మూవీ హిట్ టాక్ లోకి వస్తుంది.
Also Read: SS Rajamouli: రాజమౌళి సినిమా మధ్యలోనే ఆగిపోయిన విషయం మీకు తెలుసా..?