ఆర్ఆర్ఆర్ పోస్టర్: ఉగాదికి అదిరిపోయిన గిఫ్ట్

ఇంగ్లీష్ వారికి జనవరి 1వ తేదీనే కొత్త సంవత్సరం.. కానీ కొన్ని భాషల వారికి.. ముఖ్యంగా దక్షిణాది వారికి ఉగాదితోనే నూతన తెలుగు సంవత్సరం ఆరంభం అవుతుంది. ఈ ఉగాదికి ప్రజలకు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి. ఎవ్వరూ ఊహించనివిధంగా.. ముందుగా ప్రకటించకున్నా కూడా రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి ప్రజల్లో సంబరాలు చేసుకుంటున్న పోస్టర్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రజలు ఎన్టీఆర్, చరణ్ ను గాల్లో […]

Written By: NARESH, Updated On : April 13, 2021 12:01 pm
Follow us on

ఇంగ్లీష్ వారికి జనవరి 1వ తేదీనే కొత్త సంవత్సరం.. కానీ కొన్ని భాషల వారికి.. ముఖ్యంగా దక్షిణాది వారికి ఉగాదితోనే నూతన తెలుగు సంవత్సరం ఆరంభం అవుతుంది. ఈ ఉగాదికి ప్రజలకు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు దర్శక ధీరుడు రాజమౌళి. ఎవ్వరూ ఊహించనివిధంగా.. ముందుగా ప్రకటించకున్నా కూడా రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి ప్రజల్లో సంబరాలు చేసుకుంటున్న పోస్టర్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రజలు ఎన్టీఆర్, చరణ్ ను గాల్లో ఎగురవేస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది.

భారతదేశంలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మరియు తెలంగాణ రాష్ట్రాలకు నూతన సంవత్సర దినం ఉగాది సందర్భంగా ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే9 ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాతలు చిత్రం నుంచి ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సంబరాల్లో మునిగితేలుతున్న జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫొటో ఆకట్టుకుంది. ఈ పోస్టర్ స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన వేడుకలను గుర్తుకు తెచ్చేలా కనిపిస్తోంది.

ఆర్‌ఆర్‌ఆర్ కొత్త పోస్టర్‌లో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపిస్తున్నారు. తెల్లటి చొక్కా.. చెకర్డ్ ప్యాంటు ధరించి ఉండగా, జూనియర్ ఎన్‌టిఆర్ కొమరం భీమ్ గా సాధారణ తెల్ల కుర్తా-పైజామా ధరించి కనిపిస్తాడు. సూపర్ స్టార్స్ ఇద్దరిని ఒక పెద్ద వంతెన వద్ద ప్రజలు ఎగురవేస్తున్నట్టుగా పోస్టర్ ఉంది. . వారు తలకు పసుపు కండువా చుట్టబడి ఉంది.

ఈ పోస్టర్‌ను ఆర్‌ఆర్‌ఆర్ మూవీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. “ప్రతిఒక్కరికీ సంపన్న సంవత్సరం కావాలని కోరుకుంటున్నాం .. అన్ని భాషల్లో వారికి ఉగాది శుభాకాంక్షలను తెలిపారు. .

https://twitter.com/RRRMovie/status/1381827049862569984?s=20