నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ సాధించిన డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి ‘రామ్ చరణ్’ పుట్టినరోజున, అల్లూరి గెటప్ లో ఉన్న చరణ్ కొత్త పోస్టర్ ను విడుదల చేసి అభిమానులకు ఫుల్ కిక్ ను ఇచ్చారు. అయితే, మే 20న ఎన్టీఆర్ బర్త్ డే. మరి ఆ రోజున ఎన్టీఆర్ పాత్ర మీద రాజమౌళి ఎలాంటి పోస్టర్ ను రిలీజ్ చేస్తాడా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, చిత్ర యూనిట్ నుండి అందుతోన్న సమాచారం ప్రకారం కోమరం భీమ్ గెటప్ లో ఎన్టీఆర్ ను కొత్తగా చూపించే ఓ ఘనమైన సరికొత్త పోస్టర్ ను రాజమౌళి సిద్ధం చేయిస్తున్నాడని, మే 20న తారక్ పుట్టినరోజు నాడు ఆ పోస్టర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక తెలుగు చిత్రసీమలో రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ ఒకే సినిమాలో కనిపించబోతుండే సరికి, ఈ భారీ మల్టీస్టారర్ పై అత్యున్నతమైన అంచనాలు ఉన్నాయి.
ఆ మాటకొస్తే మొదటి నుండి నేషనల్ వైడ్ గా ఈ సినిమా పై భారీ ఆసక్తి నెలకొంది. పైగా ఈ మల్టీస్టారర్ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండటం, అలాగే మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరో కీలక పాత్రలో కనిపించబోతుండటంతో.. ఈ సినిమా కోసం బాలీవుడ్ జనం కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
అదేవిధంగా ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తుండటం, మిగిలిన కీలక పాత్రలలో ఇతర హాలీవుడ్ నటీనటులను తీసుకోవడంతో అటు హాలీవుడ్ లోనూ ఈ సినిమా పై ఒక అవగాహన ఉంది. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమాకి ఇంటర్నేషనల్ వైడ్ గా మంచి మార్కెట్ అయ్యేలా ఉంది. అందుకే రాజమౌళి కూడా ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించడానికి బలంగా ట్రై చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.