RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. పాన్ ఇండియా లెవెల్లో డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. మెగాఫ్యామిలి, నందమూరి ఫ్యామిలి హీరోలు కలిసి నటిస్తున్న ఈ మూవీపై తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అలియా భట్, ఒలివియా మోరిస్ లు నటిస్తున్నారు. కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, పాట లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కు చిత్ర బృందం మూహుర్తం ఫిక్స్ చేసింది. ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు సోఐల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ అప్డేట్ తో అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ముంబై వేదికగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించి సల్మాన్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించున్నట్లు టాక్ వినిపిస్తుంది. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖనిలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
https://twitter.com/RRRMovie/status/1465267058208174085?s=20