RRR: ‘ఆర్ఆర్ఆర్’పై మరో బాంబు పేల్చిన రాజమౌళి.. షాకింగ్ నిర్ణయం

RRR: దర్శకధీరుడు రాజమౌళి చెక్కుతున్న శిల్పం లాంటి మూవీ ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత వస్తున్న ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా బోలెడు అంచనాలున్నాయి. ఇప్పటికే దూసరా సందర్భంగా అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల చేస్తామని రాజమౌళి అండ్ టీం ప్రకటించింది. అయితే సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై మరో బాంబు పేల్చాడు రాజమౌళి. పోయిన సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్ 13కు వాయిదా వేశారు.దసరాకు […]

Written By: NARESH, Updated On : September 11, 2021 2:10 pm
Follow us on

RRR: దర్శకధీరుడు రాజమౌళి చెక్కుతున్న శిల్పం లాంటి మూవీ ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత వస్తున్న ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా బోలెడు అంచనాలున్నాయి. ఇప్పటికే దూసరా సందర్భంగా అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల చేస్తామని రాజమౌళి అండ్ టీం ప్రకటించింది. అయితే సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై మరో బాంబు పేల్చాడు రాజమౌళి.

పోయిన సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్ 13కు వాయిదా వేశారు.దసరాకు విడుదల చేయాలని అనుకున్నారు.. ఇప్పుడు రాజమౌళి సినీ ప్రియులందరికీ షాక్ ఇచ్చారు. సినిమా విడుదల గురించి తెలియజేస్తూ శనివారం మధ్యాహ్నం ‘ఆర్ఆర్ఆర్’ టీం ఒక ట్వీట్ చేసింది.

‘అక్టోబర్ లో ఆర్ఆర్ఆర్ విడుదల చేసేందుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకూ పూర్తయ్యింది. కానీ అందరు అనుకున్నట్టే ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా వేస్తున్నాం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు ఇంకా పూర్తిగా తెరుచుకోని నేపథ్యంలో కొత్త విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నాం.. థియేటర్లు పున: ప్రారంభమైన వెంటనే సినిమా విడుదల చేస్తాం’ అని ఆర్ఆర్ఆర్ యూనిట్ తాజాగా ట్విట్టర్ లో సంచలన ప్రకటన చేసింది.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్, రాంచరణ్ , అజయ్ దేవ్ గణ్, ఆలియా భట్ సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీని కరోనా వేళ థియేటర్లు తెరుచుకోని ఈ సందర్భంలో రిలీజ్ చేసి నష్టాలు చవిచూడకూడదని.. కరోనా పూర్తిగా తగ్గాకనే రిలీజ్ చేయాలని ఆర్ఆర్ఆర్ డిసైడ్ అయ్యింది. అందుకే ఈ సినిమాను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే సంక్రాంతి సీజన్ అగ్రహీరోల సినిమాలతో లాక్ అయిపోయింది. సమ్మర్ లోనూ చిరంజీవి ‘ఆచార్య’ సహా కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ కు డేట్ ప్రకటించాయి. ఇక న్యూఇయర్ క్రిస్మస్ కు అల్లు అర్జున్ ‘పుష్ప’ సహా పలు పెద్ద సినిమాలు డేట్స్ ను ఇప్పటికే ప్రకటించాయి. అందుకే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసేది  తేదీ ప్రకటించలేదు.  కరోనా పరిస్థితులు చక్కబడి.. థియేటర్లలోకి జనాలు బాగా వచ్చేది చూసి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.