RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమాలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని తెలుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధుల ఇతివృత్తంగా తీసుకున్న కథ కావడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. మొదటి ఆట చూసేందుకే ఇష్టపడుతున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్, రాంచరణ్ సరసన అలియాభట్ నటిస్తున్నారు.

ట్రిపుల్ ఆర్ సినిమా రాజమౌళి కలల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది. ఇద్దరు అగ్రహీరోలను పెట్టి సినిమా నిర్మించడం అంటే మాటలు కాదు. అందుకు చాలా రిస్క్ ఉంటుంది. వారి ఇమేజ్ దృష్ట్యా పాత్రలకు తగిన విధంగా చిత్రీకరణ చేసి వారిని తమ అభిమానుల ఆశలు నెరవేర్చేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై అందరిలో ఓ రేంజ్ లో అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీని వెంటనే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read: AP Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ: జగన్ కేబినెట్ లో ఎవరు ఇన్..? ఎవరు ఔట్?
సినిమా ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదల అవుతున్న సందర్భంలో పలు చోట్ల ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు థియేటర్ల నుంచి టికెట్లు తీసుకుంటున్నారు. కుప్పంలో ట్రిపుల్ ఆర్ సినిమా మూడు థియేటర్లలో విడుదల అవుతోంది. దీంతో అభిమానులు మూడు వేల టికెట్లు తీసుకునేందుకు రెడీ అయ్యారు. కానీ టికెట్ల మీద కొంతమంది అభిమాన సంఘం నేతల పేర్లు, ఫోన్ నెంబర్లు ఉండటంతో అభిమానులు ఆగలేకపోయారు.

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని బీసీయన్ సినీ కాంప్లెక్స్ వద్ద మెగా, నందమూరి అభిమానుల మధ్య గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ మూవీతో ఇంకా ఎన్ని ఘర్షణలు జరుగుతాయో తెలియడం లేదు. మొత్తానికి ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవలతో వివాదం ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే ఆనందించాల్సిందిపోయి అనవసరంగా గొడవలకు కారణమవుతుండటం వివాదాస్పదమవుతోంది. చంద్రబాబు ఇలాఖాలో సినిమాపై గొడవ రావడంతో అభిమానుల్లో కాస్త అసంతృప్తి నెలకొంది.
Also Read: Mahesh Rajamouli Movie: మహేష్ తో రాజమౌళి మూవీ కథ అలా ఉంటుందట.. ఓపెన్ అయిన విజయేంద్రప్రసాద్
Recommended Video:
Recommended Video:
[…] Inspiring Success Story: అందరు కలలు కంటుంటారు. కానీ కొందరే వాటిని నిజం చేసుకుంటారు. జీవితంలో అనుకున్న లక్ష్యం చేరుకనే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని స్థిరపడే వారు కొందరైతే. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించడం చూస్తుంటాం. మన దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పినట్లు కలలు కనండి సాకారం చేసుకోండి అనే నానుడిని నిజం చేస్తూ ఆమె జీవితాశయం నెరవేర్చుకుంది. భవిష్యత్ గురించి బెంగ లేకుండా చేసుకుంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చినా భారీ వేతనం పొందుతూ అందరిని ఆశ్చర్య పరుస్తోంది. […]
[…] […]
[…] […]
[…] AP Cabinet Reshuffle 2022: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సీఎం జగన్ ఆదివారం సహచర మంత్రులకు విందు ఇవ్వనున్నారు. శుక్రవారంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఆదివారం నాటి విందు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడూ లేనట్టుగా సీఎం విందు సమావేశం ఏర్పాటు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో విస్తరణ అంశాన్ని ప్రస్తావించిన సీఎం చేర్పులు మార్పులకు సిద్ధంగా ఉండాలని సహచరులకు సూచించారు. రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రారంభంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మంత్రివర్గం నుంచి తొలగిస్తున్న వారికి అంతే ప్రాధాన్యత కలిగిన పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో కొందరు మంత్రులు పదవులను వదులుకునేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుండడం ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కొత్త మంత్రుల జాబితా సైతం సిద్ధమైందని చెబుతున్నారు. […]
[…] […]