https://oktelugu.com/

Tollywood: ఏపీ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన నిర్మాత దానయ్య…

Tollywood: దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, పోస్టర్స్, వీడియో లకు విశేష స్పందన లభించింది. కాగ్ ఐటివల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా విడుదలైన గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఇప్పటికే షూటింగ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 11, 2021 12:20 pm
    Follow us on

    Tollywood: దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, పోస్టర్స్, వీడియో లకు విశేష స్పందన లభించింది. కాగ్ ఐటివల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా విడుదలైన గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 60 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు చిత్రయూనిట్.

    rrr movie producer danayya sensational comments on ap governament

    ఈ క్రమంలో శనివారం ఉదయం నిర్వహించిన ఆర్ఆర్ఆర్ విలేకర్ల సమావేశంలో ప్రొడ్యూసర్ దానయ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం దాదాపుగా 1600 థియేటర్లు ఉన్నాయి. ఏపీలో సినిమా టికెట్ రేట్లు విషయం లోనే చిత్ర పరిశ్రమ సమస్య ఎదుర్కొంటుంది. తాజాగా ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ లో ఆ సినిమా నిర్మాత డివివి.దానయ్య ఈ అంశంపై మాట్లాడారు. ప్రెస్ మీట్ లో నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం సినిమాల విషయంలో తీసుకున్న నిర్ణయాలు సినీ పరిశ్రమకి నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఏపి గవర్నమెంట్ సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించారు. అది నిర్మాతలకు వర్క్ అవుట్ కాదు. పెద్ద సినిమాలకు ఆ టికెట్ రేట్లు ఉంటే పెట్టిన డబ్బులు కూడా రావు అని అన్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని కలిసి టిక్కెట్ రేట్ల పై చర్చలు జరుపుతున్నాం అని తెలిపారు. మళ్ళీ కలిసి సినిమా టికెట్స్ విషయం గురించి మరోసారి మాట్లాడతామని అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మాత్రమే కాదు పెద్ద సినిమాలన్నిటికీ టికెట్ రేట్లు పెంచుకునే వెసలుబాటు కలిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరతామన్నారు దానయ్య. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడక తప్పదు.