https://oktelugu.com/

RRR Movie New Poster: ఆర్​ఆర్​ఆర్​’ అలా చూస్తే కిక్కు ఏముంటుంది.. ఇలా చూడండి

RRR Movie New Poster:  నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు రాజమౌళి. కాగా ఆయన డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ‘ఆర్​ఆర్​ఆర్​’ లాంటి సినిమా చిన్న థియేటర్లలో చూస్తే కిక్కు ఏముంటుంది చెప్పండి. అందుకే ఈ సినిమాను ఎంచక్కా ఐమాక్స్​లో చూసి ఎంజాయ్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 10, 2022 / 10:42 AM IST
    Follow us on

    RRR Movie New Poster:  నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు రాజమౌళి. కాగా ఆయన డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.

    RRR Movie New Poster

    ‘ఆర్​ఆర్​ఆర్​’ లాంటి సినిమా చిన్న థియేటర్లలో చూస్తే కిక్కు ఏముంటుంది చెప్పండి. అందుకే ఈ సినిమాను ఎంచక్కా ఐమాక్స్​లో చూసి ఎంజాయ్​ చేయమని అంటోంది ‘ఆర్​ఆర్​ఆర్​’ టీం. ఈ మేరకు ఓ పోస్టర్​ను కూడా రిలీజ్​ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఓవర్సీస్​లో ప్రీమియర్స్​కు రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి.

    Also Read: పాల్ పై మోడీ మర్డర్ ప్లాన్.. బయట పెట్టిన వర్మ

    ట్రేడ్‌ వర్గాల ప్రకారం యూఎస్‌లో 267 లోకేషన్లలో 935 షోస్‌కి అప్పుడే $500k వచ్చేశాయి. ప్రీ టికెట్‌ సేల్స్‌లో సంచలనం సృష్టించింది ఆర్ఆర్ఆర్. చరణ్‌, తారక్‌ అభిమానులు ఒక్క టికెట్‌తో ఆగట్లేదట. ఒక్కొక్కరు రెండేసి టికెట్లు కొంటున్నారు. పైగా నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రావట్లేదు.

    RRR Movie New Poster

    ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

    Also Read: పవన్ కల్యాణ్ యువ క్రికెటర్ కు చేసిన సాయమెంత?

    Tags