RRR Movie Etthara Jenda Song: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ మాత్రమే కాదు, అయితే, ఈ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ కలిసి చేసిన ‘ఎత్తర జెండా’ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వారానికో ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తూ సినీ అభిమానుల్ని అలరిస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం.

ఇప్పటికే ‘నాటు నాటు’, ‘కొమ్మా ఉయ్యాలా’, ‘దోస్తీ’ వీడియోలు పంచుకున్న టీమ్ తాజాగా సెలబ్రేషన్ ఆంథమ్ ‘ఎత్తర జెండా’ను అందించింది. ఈ కొత్త వీడియోలో దర్శకుడు రాజమౌళి, అజయ్‌దేవ్‌గణ్, ఒలివియా మోరిస్ తళుక్కున మెరిశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.
Also Read: F3 Movie Song: ‘ఊ ఆ అహ అహ’తో ఊపు తెచ్చిన ‘ఎఫ్ 3’
ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ వీడియో సాంగ్ చూసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ లో అసలు గురుత్వాకర్షణ సిద్ధాంతం పనిచేయలేదు ఏమో అనిపించే స్థాయిలో తారక్ – చరణ్ స్టెప్స్ వేశారు. ఆర్ఆర్ఆర్ గొప్ప విజయం వెనుక ఈ సాంగ్ కూడా ఓ ప్రధాన కారణం.

అందుకే.. ఈ సాంగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి కీరవాణి అందించిన మ్యూజిక్ కూడా టాప్ లో ఉంది. దర్శకుడు రాజమౌళితో పాటు మిగతా టీమ్ కూడా అద్భుతంగా పని చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఒక తెలుగు సినిమాకి ఈ స్థాయి కలెక్షన్సా ? అంటూ థ్రిల్ అయిపోయారు.
అసలు ఈ సినిమా రోజురోజుకు వందల కోట్లును ఎలా కలెక్ట్ చేస్తోంది ? అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యచకితులు అయ్యారు. మొత్తమ్మీద ఈ సినిమా కోట్లను కొల్లగొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’కి వచ్చిన ఈ కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు. హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి.
Also Read:Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా కూడా లీక్ అవ్వబోతుందా??.. ఆందోళనలో మేకర్స్
Recommended Videos:
[…] Acharya: కొరటాల శివ ఏం చేయగలడో ? ఎంత చేయగలడో ? కొత్తగా చెప్పేదేముంది ? కమర్షియల్ అంటూ గిరి గీసుకున్న తెలుగు సినిమాని సామాజిక అంశాలతో తెలుగు తెరకు గౌరవం తెచ్చిన దర్శకుడు. సినిమా ద్వారా కూడా సమాజ సేవ చెయ్యొచ్చు అని నిరూపించిన సినీ కామ్రేడ్. సినిమా సినిమాకీ ఓ సమస్యను తీసుకుని, తన సినిమా ద్వారా ఆ సమస్యకి పరిష్కారం చెబుతూ.. సమాజ ఉద్దరణకు పాటు పడుతున్న ఫీల్ గుడ్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల. […]
[…] Ajay Devgn vs Sudeep: కన్నడ సూపర్ స్టార్ సుదీప్ భిన్నమైన హీరో. నిజానికి పదేళ్ల క్రితమే సౌత్ లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఇప్పుడంటే కన్నడలో యశ్ లాంటి కొందరు పాన్ ఇండియా స్టార్లుగా చలామణి అవుతున్నారు గానీ, కన్నడలో మొదటి పాన్ ఇండియా స్టార్ సుదీప్ నే. ఈగ సినిమాతో సుదీప్ సౌత్ సినీ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. […]