https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్ డేట్స్ !

జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ప్రత్యేకమైన అభిమానం ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’లోని తారక్ ఫస్ట్ లుక్ వీడియోను రాజమౌళి ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు.. అసలు రాజమౌళి ఎన్టీఆర్ పై ఎలాంటి వీడియోను రిలీజ్ చేయనున్నాడు ఇలా ఎన్టీఆర్ వీడియో పై ఫ్యాన్స్ లో విపరీతమైన […]

Written By:
  • admin
  • , Updated On : August 27, 2020 / 05:19 PM IST
    Follow us on


    జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ప్రత్యేకమైన అభిమానం ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో కోసం రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’లోని తారక్ ఫస్ట్ లుక్ వీడియోను రాజమౌళి ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు.. అసలు రాజమౌళి ఎన్టీఆర్ పై ఎలాంటి వీడియోను రిలీజ్ చేయనున్నాడు ఇలా ఎన్టీఆర్ వీడియో పై ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం దసరాకి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కి సంబంధించిన వీడియోని రాజమౌళి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడని.. ఇప్పటికే జక్కన్న దానికి సంబంధించిన షూట్ ను కూడా వచ్చే నెలలో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

    Also Read: షోలో ఆ తల్లీకూతుళ్లు ఉండాల్సిందేనట !

    కాగా రాజమౌళి దర్శకత్వంలో తారక్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న ఈ క్రేజీ భారీ మల్టీస్టారర్ లో ఓ గిరిజన యువతి రోల్ కూడా ఉందని.. ఈ రోల్ కోసం ఐశ్వర్య రాజేష్ ను అనుకుంటున్నారని.. ఎన్టీఆర్ పాత్రను చిన్నప్పటి నుండి ఐశ్వర్య రాజేష్ పాత్ర ప్రేమిస్తోందని.. అయితే ఆమె పాత్ర కేవలం గెస్ట్ రోల్ లాంటిదని తెలుస్తోంది. గెస్ట్ రోల్ అయినా ఇలాంటి భారీ సినిమాలో ఛాన్స్ రావడం అంటే.. ఐశ్వర్య రాజేష్ కెరీర్ కే అది పెద్ద ఛాన్స్. మొదట ఈ పాత్రకు ఓ బాలీవుడ్ హీరోయిన్ తీసుకోవాలనుకున్నా.. గిరిజన యువతిగా ఐశ్వర్య రాజేష్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందని ఆమెను తీసుకుంటున్నారు.

    Also Read: ఆ ఘనత ఒక్క ‘అర్జున్‌ రెడ్డి’ డైరెక్టర్ కే దక్కింది !

    ఇక ఈ సినిమాలో ప్రధాన హైలెట్స్ లో ఎన్టీఆర్ డైలాగ్స్ మెయిన్ హైలెట్ అట.. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు కొమరం భీం గొప్ప తనాన్ని ధైర్యాన్ని ఎలివేట్ చేస్తాయని.. పైగా డైలాగ్ చెప్పడంలో తారక్ గొప్పతనం గురించి కొత్తగా చెప్పేది ఏముంది. ఇప్పటికే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలో చరణ్ బిల్డప్ షాట్స్ కంటే కూడా.. తారక్ మాడ్యులేషన్ స్టైలే మెయిన్ హైలైట్ గా నిలిచింది. కాగా డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కరోనా నుండి బయటపడ్డారు.