https://oktelugu.com/

మహేష్ బాబు రికార్డ్ ని బ్రేక్ చేసిన బన్నీ !

అల వైకుంఠపురములో.. బన్నీ రేంజ్ ని పెంచిన సినిమా. ఇప్పటికే కొత్త రికార్డ్ లను క్రియేట్ చేసిన ఈ సినిమా, మరో రికార్డును బ్రేక్ చేసింది. అదీ సౌత్ లోనే టాప్ రేంజ్ లో.. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చే న్యూస్ ఇది. ఇప్పటి వరకు ఉన్న పాత రికార్డులన్నింటినీ ఈ సినిమా తిరగరాసిందనేది ఒక్కఎత్తు అయితే, నాన్ బాహుబలి తెలుగు రికార్డులను బ్రేక్ చేయడం బన్నీ స్టార్ డమ్ కి […]

Written By:
  • admin
  • , Updated On : August 27, 2020 / 05:28 PM IST
    Follow us on


    అల వైకుంఠపురములో.. బన్నీ రేంజ్ ని పెంచిన సినిమా. ఇప్పటికే కొత్త రికార్డ్ లను క్రియేట్ చేసిన ఈ సినిమా, మరో రికార్డును బ్రేక్ చేసింది. అదీ సౌత్ లోనే టాప్ రేంజ్ లో.. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చే న్యూస్ ఇది. ఇప్పటి వరకు ఉన్న పాత రికార్డులన్నింటినీ ఈ సినిమా తిరగరాసిందనేది ఒక్కఎత్తు అయితే, నాన్ బాహుబలి తెలుగు రికార్డులను బ్రేక్ చేయడం బన్నీ స్టార్ డమ్ కి దక్కిన అరుదైన ఘనత. తాజాగా ఈ సినిమా మరో రికార్డును క్రియేట్ చేసింది.

    Also Read: ఆర్ఆర్ఆర్ నుండి క్రేజీ అప్ డేట్స్ !

    నిజానికి ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికే ఏడు నెలల అవుతుంది. అయినా ఇన్ని నెలల్లో కూడా ఏ ఓటీటీలోకి ఈ సినిమా రాలేదు. అలాగే టీవీలో కూడా ఈ సినిమాని ప్రసారం చేయలేదు. సినిమా రిలీజ్ అయిన చాలా గ్యాప్ తర్వాత ఇటీవల ఓ టీవీలో ఈ సినిమాని టెలికాస్ట్ చేశారు. ఎలాగూ సినిమా వచ్చే ఏడు నెలలు అవుతుంది. పైగా ఇది ఫైరసీ జనరేషన్. దానికి తోడు.. లాక్ డౌన్.. అందరూ నెట్ లో ఫైరసీ సినిమాలు చూస్తున్న కాలం.. మరి ఇలాంటి టైమ్ లో ఈ సినిమాని టీవీలో టెలికాస్ట్ చేశారు. రిలీజ్ డేట్ కి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి, టీఆర్పీ ఎక్కువ వచ్చే అవకాశం లేదని ఆ ఛానెల్ నిర్వాహకులు సైతం అభిప్రాయపడ్డారు.

    Also Read: అనసూయ కోలీవుడ్‌ ఎంట్రీ ఖాయం

    కానీ అనూహ్యంగా ఈ సినిమాకి భారీ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఏకంగా రికార్డు స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ ఉన్న అత్యధిక టీఆర్పీని కూడా తొక్కేసి కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తూ ఏకంగా 29.4 టీఆర్పీతో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇంతకు ముందు వరకూ ఈ రికార్డ్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ పేరిట ఉండేది. ఆ సినిమాకి 23.4 టీఆర్పీ ఉండేది. ఇప్పుడు బన్నీ సినిమా ఆ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసి… ఏకంగా 29.4 టీఆర్పీని సొంతం చేసుకోవడం విశేషం. ఇలా, అల వైకుంఠపురములో మరో మైలురాయిని అందుకోవడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ హ్యాపీగా అవుతున్నారు.