
ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఇటీవలే విడుదలైన ‘దోస్త్’ సాంగ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. ఈ క్రమంలోనే దసరాకు ఈ మూవీని రిలీజ్ చేయడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. కరోనా థర్డ్ వేవ్ రాకుంటే అనుకున్నట్లే సినిమా రిలీజ్ అవుతుంది.
ఈ క్రమంలోనే ప్రమోషన్స్ విషయంలో మాత్రం దర్శకుడు రాజమౌళి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదని నిర్ణయించారు. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే అప్డేట్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.
ప్రస్తుతం థియేటర్లకు జనాలు వచ్చే అవకాశం లేకపోవడంతో ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 13న విడుదల అయ్యేలా కనిపించడం లేదంటున్నారు. వచ్చే ఏడాది ఉగాదికి రావచ్చని మరో టాక్ నడుస్తోంది. ఇక సినిమా ఇప్పట్లో వచ్చినా రాకపోయినా కూడా విడుదలయ్యే వరకూ ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని రాజమౌళి టీం పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది.
వచ్చే నెలలో ఆర్ఆర్ఆర్ నుంచి మరొక స్పెషల్ అప్డేట్ రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.. ఒక ప్రమోషన్ డైలాగ్స్ తో ఉండే ప్రోమోను విడుదల చేయాలని అనుకుంటున్నాడట.. అందులో రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా అద్భుతమైన డైలాగ్స్ తో కిక్ ఇస్తారని అంటున్నారు. సినిమాలోని అతి కీలకమైన డైలాగ్స్ తోనే సినిమాపై అంచనాలు మరింత పెంచాలని అనుకుంటున్నారట.. మరి ఆ అప్డేట్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారట.. అది ఎంతవరకు అంచనాలు అందుకుంటుందో వేచిచూడాలి.