RRR Movie: దీపావళి నుంచి ప్రమోషన్స్ షురూ చేయనున్న… ఆర్‌ఆర్‌ఆర్ టీమ్

RRR Movie: కరోన కారణంగా ప్రపంచం అంతా ఒక్కసారిగా స్తంబించి పోయింది అనే చెప్పాలి. సాధారణంగా అయితే అక్టోబ‌రు 13వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యి దేశ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ఈ సినిమా సంద‌డి చేస్తుండాలి. కానీ క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా అని నుంచి సినిమాను వాయిదా వేయక త‌ప్ప‌లేదు. అంత‌కు ముందే రెండుసార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రాన్ని ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా వాయిదా వేశారు. చివ‌రికి 2022 జ‌న‌వ‌రి 7కు సినిమాను […]

Written By: Raghava Rao Gara, Updated On : October 24, 2021 10:52 am
Follow us on

RRR Movie: కరోన కారణంగా ప్రపంచం అంతా ఒక్కసారిగా స్తంబించి పోయింది అనే చెప్పాలి. సాధారణంగా అయితే అక్టోబ‌రు 13వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యి దేశ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ఈ సినిమా సంద‌డి చేస్తుండాలి. కానీ క‌రోనా సెకండ్ వేవ్ పుణ్య‌మా అని నుంచి సినిమాను వాయిదా వేయక త‌ప్ప‌లేదు. అంత‌కు ముందే రెండుసార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రాన్ని ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా వాయిదా వేశారు. చివ‌రికి 2022 జ‌న‌వ‌రి 7కు సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మూవీ యూనిట్ ప్ర‌క‌టించారు.

కానీ సంక్రాంతికి మరో మూడు భారీ చిత్రాలు షెడ్యూల్ అయి ఉండ‌టంతో ఆర్ఆర్ఆర్ కొత్త డేట్ విష‌యంలో మిగతా చిత్రాల బృందాల నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మవుతున్నట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇంకా స్పష్టత రాలేదు… కాక‌పోతే ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ మాత్రం ఇంకా ప్ర‌మోష‌న్లు మాత్రం మొద‌లుపెట్ట‌లేదు. విడుద‌ల‌కు స‌రిగ్గా రెండు నెల‌ల ముందు ప్ర‌మోష‌న్ల హోరు మొద‌లుపెట్ట‌దానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుందంట. ఇందుకోసం దీపావ‌ళి పండుగ‌కు ముహూర్తం కూడా నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

గ‌త ఏడాది సీతారామ‌రాజు, కొమ‌రం భీంల మీద వేర్వేరుగా టీజ‌ర్లు వ‌దిలాడు రాజ‌మౌళి. ఇప్పుడు ఇద్ద‌రినీ క‌లిపి ఒక స్పెష‌ల్ టీజ‌ర్‌ను రెడీ చేస్తున్నాడ‌ట‌ జక్కన్న. సినిమా మీద అంచ‌నాలు మ‌రింత పెంచేలా ఈ టీజ‌ర్ ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ టీజ‌ర్ త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా భారీగానే ప్ర‌మోష‌న్లు చేయ‌డానికి రాజమౌళి ప్ర‌ణాళిక రూపొందించినట్లు టాక్ నడుస్తుంది. సోష‌ల్ మీడియా ప్ర‌చారంతో పాటు ముంబ‌యి, బెంగ‌ళూరు, చెన్నై, కోచి లాంటి న‌గ‌రాల్లో ఈవెంట్స్ నిర్వహించేందుకు కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.