Komuram Bheemudo Song Lyrics in Telugu & English: నేటి నటరత్న ఎన్టీఆర్ గిరిజనోద్యమ నాయకుడు, గోండు బొబ్బిలి కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు అనగానే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి కలిగింది. ఏ పాత్రకైనా ప్రాణం పెట్టే ఎన్టీఆర్.. Komaram Bheemudo song lyrics కచ్చితంగా గోండు బొబ్బిలి గిరిజనోద్యమ నాయకుడి పాత్రకు ప్రాణం పోస్తాడు అనిపించింది. దానికి తగ్గట్టుగానే ఎన్టీఆర్ కట్టు బొట్టు కొమురం భీమ్ ను తలపించాయి.

కాగా అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొమురం భీమ్ పాత్రలో తారక్ పై ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో టీజర్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ ను కాలభైరవ పాడాడు. చాలా బాగా పాడాడు. కొమురం భీం వీరత్వం గురించి ఈ సాంగ్ సాగనుంది. నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి ఈ పాటను కూడా అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కించాడు.
ఇక లిరిక్స్ కూడా అర్ధవంతంగా అద్భుతంగా ఉన్నాయి.
*కొమురం భీముడో..కొమురం భీముడో
అర్రాసు నెబుడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో…*
అంటూ సాగిన ఈ లిరిక్స్ చాలా లోతైన పదాలతో భావాలతో సాగాయి. అర్రాసు నెబుడోలు: అంటే బంగారం తయారు చేసేవాడని, అలాగే వేడే చేసే కొలిమి అని అర్ధం. అలాగే మండాలి కొడుకో అంటే కొలిమిలో మండిన కొమురం భీం అని అర్థం. మొత్తానికి ఆర్ఆర్ఆర్ లోని ఈ ‘కొమురం భీముడో’ పాట లిరికల్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
Also Read: Amritha Aiyer: అల్లు అర్జున్ తో పాటు సమంత కూడా ఇష్టం అట !
ఇక రిలీజ్ అయిన గంటలోనే ఈ సాంగ్ రికార్డుల వేట మొదలెట్టింది. ఎన్టీఆర్ పాత్ర ‘కొమురం భీమ్’ పరిచయ సాంగ్ కాబట్టి, సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం గ్యారంటీ. ప్రస్తుతానికి అయితే, అత్యంత వేగంగా లక్షల వ్యూస్ తో దూసుకువెళ్తుంది. మొత్తమ్మీద ఎన్టీఆర్ ‘గోండు బెబ్బులి’ సాంగ్ ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చేసింది.
ఇక ఈ జనరేషన్ లో మొదటిసారి టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు బడా స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో.. మొదటి నుండి ఈ సినిమా పై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారు అభిమానులు.
Komaram Bheemudo Song lyrics in Telugu
coming soon..
Komaram Bheemudo Song lyrics in English
coming soon..
Also Read: Pushpa Collections: బాక్సాఫీస్ : ‘పుష్ప’ 6 రోజుల కలెక్షన్స్ !