https://oktelugu.com/

RRR vs Radheshyam: ఆర్ఆర్ఆర్ అలా.. రాధేశ్యామ్ ఇలా.. మధ్యలో భీమ్లానాయక్.. ఎవరికి కలిసివస్తుంది?

RRR vs Radheshyam: రాజమౌళి తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. రాజమౌళి గత చిత్రాలు బాహుబలిలాగేనే ‘ఆర్ఆర్ఆర్’ రన్ టైమ్ నిడివి కూడా చాలా ఎక్కువగా అయ్యింది. మూడు గంటల కంటే ఎక్కువగానే ఈ సినిమా ఉంది. సినిమా రన్ టైమ్ 3 గంటల 6 నిమిషాలు అని చిత్రం ప్రకటించింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా 3 నిమిషాల 7 […]

Written By:
  • NARESH
  • , Updated On : December 10, 2021 / 01:53 PM IST
    Follow us on

    RRR vs Radheshyam: రాజమౌళి తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. రాజమౌళి గత చిత్రాలు బాహుబలిలాగేనే ‘ఆర్ఆర్ఆర్’ రన్ టైమ్ నిడివి కూడా చాలా ఎక్కువగా అయ్యింది. మూడు గంటల కంటే ఎక్కువగానే ఈ సినిమా ఉంది. సినిమా రన్ టైమ్ 3 గంటల 6 నిమిషాలు అని చిత్రం ప్రకటించింది.

    RRR-Radhe-Shyam-and-Bheemla-Nayak

    ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా 3 నిమిషాల 7 సెకన్ల నిడివితో ఉండడం విశేషం. అయితే అన్ని గంటలు ఉన్నా సినిమాను ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా నడిపించడం ఎలాగో రాజమౌళికి బాగా తెలుసు. ప్రేక్షకుల నాడిని ఎలా పట్టుకోవడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ ఎక్కువ రన్ టైమ్ అనేది ఆ సినిమాకు సమస్యే కాదంటున్నారు.

    ఇక ‘ఆర్ఆర్ఆర్’కు పోటీగా వారం తర్వాత విడుదలవుతున్న మూవీ ప్రభాస్ ‘రాధేశ్యామ్’. ఈ మూవీ రన్ టైమ్ ను తాజాగా దర్శక నిర్మాతలు ఖరారు చేశారు. ఈ పీరియాడికల్ డ్రామాలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. తెలుగు వెర్షన్ రాధేశ్యామ్ మూవీ కేవలం 2 గంటల 20 నిమిషాలు మాత్రమే ఉందట.. ఇది చాలా సూటిగా.. సంక్షిప్తంగానే సినిమా ఉంటుందని.. బోర్ కొట్టకుండా తక్కువగానే కట్ చేశారని అంటున్నారు.

    Also Read: “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ ఓటీటీ రిలీజ్ పై క్లారిటి ఇచ్చిన మూవీ యూనిట్…

    అయితే బాలీవుడ్ వెర్షన్ మాత్రం దాదాపు 2గంటల 30 నిమిషాలు ఉంటుందట.. ‘రాధేశ్యామ్’ హిందీతోపాటు దక్షిణ భారత భాషలలలో వేర్వేరుగా విడుదలవుతోంది. పాటలు కూడా పూర్తి డిఫెరెంట్ గా ఉన్నాయి. తక్కువ రన్ టైంతో సినిమా తమకు పెద్ద ప్రయోజనం కలిగిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

    ఇక మధ్యలో వస్తున్న పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ మూవీని రెండున్నర గంటల నిడివితోనే విడుదల చేస్తున్నారు. అది ఆల్ రెడీ మలయాళంలో హిట్ కావడంతోపాటు త్రివిక్రమ్ మరింత ట్రిమ్ చేయడంతో సినిమా ఉత్కంఠ రేపడం ఖాయమట.. మరి   ఈ రన్ టైమ్ విషయం ఆర్ఆర్ఆర్ కు లాభిస్తుందా? లేక రాధేశ్యామ్ కు కలిసి వస్తుందా? భీమ్లానాయక్ అదరగొడుతాడా? అన్నది వచ్చే సంక్రాంతికి గానీ తెలియదు. చూడాలి మరీ.

    Also Read: ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” అప్డేట్… ఫుల్ జోష్ లో డార్లింగ్ అభిమానులు